
అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై
గతేడాది యూఏఈలో జరిగిన ప్రపంచకప్ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడు. వెంటనే అతను భారత వన్డే కెప్టెన్‌గా కూడా వైదొలిగాడు. 2022 జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన 3మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడిపోయిన ఒక రోజు తర్వాత అతను కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి తన కెప్టెన్సీనీ వదులుకోవడం రోహిత్ భారత్‌కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

కేవలం ధోనీ నుంచి మాత్రమే
'నేను చివరగా టెస్ట్ కెప్టెన్సీ నుండి వైదొలిగినప్పుడు.. నేను గతంలో ఆడిన కేవలం ఒక వ్యక్తి నుంచి మాత్రమే నాకు సందేశం వచ్చింది. అదెవరో కాదు MS ధోని. చాలా మంది వద్ద నా నంబర్ ఉంది.. చాలా మంది నాకు పరోక్షంగా సలహాలు ఇస్తారు.. చాలా మంది నా గురించి మాట్లాడతారు. టీవీలో నా ఆట గురించి చర్చలు పెడతారు. లాంటి వారిలో నా నంబర్ ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ వారెవరూ నాకు మెస్సేజ్ చేయలేదు. కానీ ధోనీ నుంచి మాత్రమే నాకు మెసేజ్ వచ్చింది.' అని కోహ్లీ చెప్పాడు. 'ధోనీ నాకు మెస్సేజ్ చేశాడంటే మా మధ్య పరస్పర గౌరవం, అలాగే అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ ఉంది. మేము ఇరు వైపు కమ్యూనికేట్ చేసుకోవడానికి పూర్తి భద్రత ఉంటుంది. ఎందుకంటే నేను ధోనీ నుంచి ఏమీ ఆశించను.. అలాగే ధోనీ కూడా నా నుంచి ఏమీ ఆశించాడు.' అని కోహ్లీ అన్నాడు.
అప్పట్లో కోహ్లీకి పూర్తి స్వేచ్ఛ
'నేను టీ20 కెప్టెన్సీ నుండి వైదొలగడం గురించి మొదట బీసీసీఐతో కమ్యూనికేట్ చేసినప్పుడు నా ఆలోచన ఇది అందువల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని నేను వారికి చెప్పాను. బీసీసీఐ పెద్దలు కూడా ఈ నిర్ణయాన్ని సాదరంగా స్వీకరించారు. ఎవరూ ఎలాంటి సందేహాలు వెలిబుచ్చలేదు. అలాగే ఒక్కరు కూడా టీ20 కెప్టెన్సీని విడిచిపెట్టకూడదని నన్ను ఫోర్స్ చేయలేదు' అని 2021డిసెంబర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












