
గొప్ప గౌరవం
'ముందుగా ఒకటి చెప్పాలనుకుంటున్నా.. ఇప్పుడు చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నా. టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గౌరవం. కానీ ఇప్పుడు పగ్గాలు వదిలేసి ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. పని భారాన్ని తగ్గించుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నా. దాదాపు గత 6-7 ఏళ్లుగా అధిక పనిభారం, ఒత్తిడి ఉంది.
అయినా మా ప్లేయర్స్ అద్భుతంగా ఆడుతున్నారు. మెగా టోర్నీలో అనుకున్న ఫలితాలు రాలేదని తెలుసు. కానీ బాగానే ఆడాము అనుకుంటున్నాం. ముఖ్యంగా చివరి మూడు మ్యాచులలో. టీ20 క్రికెట్ భిన్నమైంది. మొదటి రెండు ఓవర్లలో ఎవరు పైచేయి సాధిస్తారో వారి అధిపత్యం కొనసాగుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో మేం ఇదే మిస్సయ్యాం' అని విరాట్ కోహ్లీ అన్నాడు.

అప్పటి నుంచే క్రికెట్ ఆడడం మానేస్తా
'నేను ఇదివరకు చెప్పినట్లుగానే పాకిస్తాన్, న్యూజీలాండ్ మ్యాచ్‌లలో మేము ధైర్యంగా ఆడలేకపోయాం. అది నిజంగా కఠిన సమయం. రవి భాయ్, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. సంవత్సరాలుగా వారు గొప్పగా పనిచేస్తున్నారు. ఆటగాళ్లు మంచి వాతావరణంలో ఉండేలా కృషి చేశారు. అందరూ ఆటగాళ్లతో బాగా కలిసిపోయారు. టీ20ల్లో కెప్టెన్‌గా తప్పుకున్నంత మాత్రాన నా ఆటలో తీవ్రత తగ్గిపోదు. ఒకవేళ అలా ఆడలేకపోతే.. అప్పటి నుంచే క్రికెట్ ఆడడం మానేస్తా. నేను కెప్టెన్ కాకముందు కూడా ఆటపైనే ధ్యాస పెట్టా' అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

కొత్త కెప్టెన్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే
కెప్టెన్‌గా, ఆటగాడిగా విరాట్ కోహ్లీ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే టెస్టుల మాదిరే వన్డేల్లో భారత్ విజయవంతమైందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. 2019 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లో ఓడింది. వన్డేల్లో బ్యాటర్‌గా కోహ్లీకి మంచి రికార్డే ఉన్నా.. కెప్టెన్‌గా అద్భుతమైన ఘనతలేమీ లేవు. సారథ్యం, బయో బబుల్ వాతావరణం తన బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని టీ20 కెప్టెన్సీ వదులుకున్న విరాట్.. వన్డే సారథ్యం నుంచి కూడా తప్పుకోవాల్సి వస్తుందేమోనన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
భారత్‌లో 2023 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో కొత్త కెప్టెన్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే.. విరాట్ పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవచ్చు. అయితే అతడి టెస్టు కెప్టెన్సీకి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు.

రేసులో రోహిత్
విరాట్ కోహ్లీ 2023 ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా ఉంటాడా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమే. కానీ ప్రస్తుతానికి టీ20 జట్టు కెప్టెన్ సీటు మాత్రమే ఖాళీ అయింది. కాబట్టి ఈ ఫార్మాట్లో కోహ్లీ వారసుడు ఎవరు అన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం. తాత్కాలిక ప్రాతిపదికన చూసుకుంటే.. రోహిత్ పేరే ముందు వరుసలో ఉంటుంది. పొట్టి క్రికెట్లో సారథిగా అతడికి మంచి రికార్డే ఉంది.
ఐపీఎల్‌లో ,ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు విజేతగా నిలిపిన ఘనత రోహిత్ సొంతం. కోహ్లీ నుంచి అతడు టీ20 పగ్గాలు అందుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కానీ ఇది తాత్కాలిక ఏర్పాటేనా? ఒకవేళ కొత్త వన్డే కెప్టెన్‌ను నియమించాల్సి వస్తే ఆ బాధ్యతలు కూడా అతడికే అప్పగిస్తారా అన్నది ప్రశ్న. రోహిత్‌కు ఇప్పుడు 34 ఏళ్లు. బీసీసీఐ ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications












