
మనోవేదనకు గురయ్యా..
ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లీ... ఫామ్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో తాను జట్టు కోసం ఆశించిన రితీలో రాణించలేకపోయానని, దాంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పాడు. ఇదే తనను మనోవేదనకు గురిచేసిందని వెల్లడించాడు.
'ఈ మ్యాచ్‌లో నేను అనుకున్న విధంగా మా జట్టుపై ప్రభావం చూపించగలిగాను. దాంతో మా టీమ్ మంచిస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో నాపై భారీ అంచనాలు ఉండడానికి కారణం ఇంతకుముందు నేను ఆడిన విధానమే. అలాంటప్పుడు మన ఆలోచనా విధానాన్ని సరైన దృక్పథంలో ఉంచుకోవాలి. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోవద్దు.

వారికి రుణపడి ఉంటా..
నేనీ మ్యాచ్‌లో రాణించేందుకు చాలా కష్టపడ్డా. మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో 90 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేశా. దీంతో చాలా ప్రశాంతంగా బరిలోకి దిగా. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో తొలిషాట్ నుంచే బాగా ఆడతాననే నమ్మకం కలిగింది. ఫీల్డర్లపై నుంచి ఆడగలననే ఆత్మవిశ్వాసం లభించింది. అలాగే ఈ సీజన్లో అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. వాళ్లందరి ప్రేమా ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా' అని విరాట్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఆర్సీబీ అదుర్స్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 నాటౌట్), మిల్లర్ (25 బంతుల్లో 3 సిక్సర్లతో 34) రాణించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడుగా... డుప్లెసిస్ (38 బంతుల్లో5 ఫోర్లతో 44) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్ పట్టిన మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.