అలా చూపించకపోతే నేనిక్కడ ఉండేవాడిని కాదేమో: కోహ్లీ

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని అంటున్నాడు. మన దేశంలో ఎందరో ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నారు. వారిని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దేశంలో క్రీడాభివృద్ధికి, క్రీడా సంస్కృతిని పెంచేందుకు నా వంతు కృషి చేస్తా' అని కోహ్లీ అన్నాడు.

మరిన్ని లీగ్‌లు నిర్వహించాలి:
ప్రజలకు అవగాహన పెరగాలంటే మరిన్ని లీగ్‌లు నిర్వహించాలి. అంతేకాదు వాటిని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. భారత ఆటగాళ్లను గుర్తించగలుగుతారు. ఇటీవల భారత్‌లో అండర్17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించారు. టీవీల్లో ప్రసారం చేయడంతోనే దీని గురించి అందరికీ తెలిసింది. మన ప్రతిభ కూడా అప్పుడే బయటపడుతుంది. నా విషయంలోనూ అదే జరిగింది' అని విరాట్ చెప్పాడు.

నా జీవిత లక్ష్యం:
మన దేశంలో క్రీడా సంస్కృతిని పెంచాలి. ఎందుకంటే నా జీవిత లక్ష్యం ఒకటే. ప్రజలందరికీ అన్ని క్రీడల పట్ల అవగాహన కల్పించాలి. అప్పుడే అన్ని క్రీడలకు విశేష ఆదరణ దక్కుతుంది. ఇదంతా జరగడానికి 10నుంచి 15 సంవత్సరాలు పట్టొచ్చు. ఫుట్‌బాల్ అంటే మన దేశంలో గోవా గుర్తుకొస్తుంది. ఒకవేళ నేను దేశం తరఫున ఫుట్‌బాల్ ఆటగాడిని అవ్వాలి అనుకుంటే గోవా వెళ్లి శిక్షణ పొందుతాను' అని తెలిపాడు కోహ్లీ.

గుర్తింపు వచ్చేది కాదేమో:
నేను అండర్19 ప్రపంచకప్ ఆడినప్పుడు ఆ మ్యాచ్‌లన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఒకవేళ అదే జరగకపోతే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండే వాడిని కాదేమో. ఇంత గుర్తింపు వచ్చేది కాదేమో. మ్యాచ్‌లను ప్రసారం చేయడం ద్వారా మా ప్రతిభ బయటికి వచ్చింది. లీగ్ మ్యాచ్‌ల ప్రసారాలే ఆటగాళ్ల ప్రతిభను బయటికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తాయి' అని కోహ్లీ వివరించాడు.

విరామం ప్రకటించిన బీసీసీఐ:
లంకలో జరిగే ముక్కోణపు టోర్నీ నుంచి కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. మార్చి 6 నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుంది. కోహ్లీతో పాటుగా ధోనీ, భువనేశ్వర్, బుమ్రా, పాండ్యాలకు సైతం విరామం ప్రకటించింది బీసీసీఐ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications