పింక్ బాల్ టెస్ట్ ఓ మైలురాయి: డే నైట్ టెస్టుకు ముందు మీడియా సమావేశంలో కోహ్లీ

హైదరాబాద్: పింక్ బాల్ టెస్టు టీమిండియాకు ఓ సవాల్ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. పింక్ బాల్ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ గురువారం మీడియాతో మాట్లాడాడు.
"పింక్ బాల్ టెస్టు భారత్‌కు ఓ సవాల్. భారత్‌లో తొలిసారి డే నైట్ టెస్టు అడుతున్నాం కాబట్టి మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇదో మైలురాయి సంఘటన" అని విరాట్ కోహ్లీ తెలిపాడు. "వేరే జట్టు లేదా బోర్డు గురించి నేను మాట్లాడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా బీసీసీఐతో మా సంభాషణలు మా టెస్ట్ ఆటను మెరుగుపరిచాయి" అని కోహ్లీ చెప్పాడు.
నవంబర్ 22న
నవంబర్ 22న భారత్ చరిత్ర సృష్టించనుంది. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో టీమిండియా తొలి డే నైట్ టెస్టు ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో పింక్ బాల్‌ను వాడనున్నారు. టెస్టు మ్యాచ్‌లకు టీవీ ప్రేక్షకులను పెంచాలన్న ఉద్దేశంతోనూ గేమ్‌లో ఈ మార్పులను తీసుకువచ్చారు. తొలి పింక్ బాల్ టెస్టుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పింక్ బాల్‌తో ఫీల్డింగ్ సెషన్ అతిపెద్ద సవాల్
పింక్ బాల్‌తో ఆడే సవాళ్లను ఈ మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ ఎత్తి చూపాడు. "పింక్ బాల్‌తో ఫీల్డింగ్ సెషన్ అతిపెద్ద సవాల్. పింక్ బాల్‌తో ఫీల్డింగ్ ఎంత కష్టమవుతుందో అభిమానులు ఆశ్చర్యపోతారు. బంతి ఖచ్చితంగా బరువుగా అనిపించింది. బరువులో ఎటువంటి తేడా ఉండదని నేను అనుకుంటున్నాను" అని కోహ్లీ అన్నాడు.
స్లిప్ క్యాచ్‌లు అందుకునేటప్పుడు
"కానీ ఏదో ఒకవిధంగా అది బరువుగా అనిపిస్తోంది. స్లిప్ క్యాచ్‌లు అందుకునేటప్పుడు బంతి చేతులను గట్టిగా తాకుంది. ఇక, బౌండరీ లైన్ వద్ద నుంచి బంతిని విసిరేటప్పుడు, ఫీల్డర్లు అదనపు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది" అని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య 2015లో తొలి తొలి డే నైట్ టెస్టు జరిగింది.
టీమిండియాకు నాలుగేళ్లు పట్టింది
ఈ దశాబ్దంలో క్రికెట్‌లో అతిపెద్ద ఆవిష్కరణగా పేర్కొనబడిన డే నైట్ టెస్టును ఆడేందుకు గాను భారతదేశానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. నిజానికి ఇది ఎప్పటికీ కంటే ఆలస్యం! ఐసీసీ 2015లోనే డై నైట్ టెస్టులకు అనుమతినిచ్చినా బీసీసీఐ, టీమిండియా వ్యతిరేకించడంతో ఉపఖండంలో పింక్ బాల్ కల నెరవేరలేదు.
గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే
అయితే, గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల తరువాత పరిస్థితులు మారిపోయాయి. నవంబర్ 22 నుంచి 26 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి డే నైట్ టెస్టుకు క్యాబ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ డే నైట్ టెస్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహించాలని భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications