చిన్నారులను కలవడం చాలా గొప్పగా అనిపిస్తోంది: కోహ్లీ

హైదరాబాద్: ప్రపంచమంతా.. నవంబరు 20న బాలల దినోత్సవం జరుపుకుంటుంటే యేటా భారత్ నవంబరు14న జరుపుకుంటోంది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి పురస్కరించుకొని నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఆటలు, పాటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేస్తారు.
పిల్లలతో సరదాగా కోహ్లీ
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పలు వేషధారణలలో కనిపిస్తారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత క్రికెటర్లు పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంతమంది పిల్లలతో సరదాగా ముచ్చటించాడు. వ్యక్తిగతంగా వారిన కలిసి వారితో సమయం గడిపాడు. ఫొటోలకు పోజులిచ్చాడు. అభిమానులకు విషెస్ చెబుతూ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
నీలో చిన్నతనాన్ని వదిలేయకు
విరాట్ ఒక్కడే కాదు శిఖర్ ధావన్, ఆజింక్య రహానె, వీవీఎస్ లక్ష్మణ్, హార్దిక్ పాండ్య, పుజారా తదితరులు చిన్నారులతో సందడి చేసిన ఫొటోలను ఫాలోవర్లతో పంచుకున్నారు. వారందరితో ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకున్న విధానాన్ని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. 'నీలోని చిన్నతనాన్ని వదిలేయకు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.'
ముందడుగేసి బాల కార్మికులను నిర్మూలించాలని
లక్ష్మణ్ అయితే ఇంకొకడుగు ముందుకేసి బాల కార్మికులను నిర్మూలించాలని పిలుపునిచ్చాడు. ఇంకా నాతోపాటు ఎవరొస్తారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications