
నాన్న ప్రభావం చాలా ఉంది
కోహ్లీ మాట్లాడుతూ... 'మా నాన్న ఈ లోకంలో ఉన్నంతకాలం నా సూపర్ హీరో. చాలా మంది మనకు స్ఫూర్తి, ప్రేరణనిస్తారు. కానీ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తూ స్ఫూర్తి, ప్రేరణ కలిగించడం వేరు. నాకు నాన్న ప్రత్యక్ష ఉదాహరణగా ఉంటూ ఎంతో ప్రేరణనిచ్చారు. నా ఆదర్శం మా నాన్న. నాన్న ప్రభావం నాపై చాలా ఉంది' అని కోహ్లీ తెలిపాడు.

ఆయనే నా సూపర్ హీరో
'చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు నా కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు అన్ని నాన్నే తీసుకొనేవారు. విభిన్న కోణాల్లో నాకు విషయాలు చెప్పేవారు. ఆయన నిర్ణయాలతో నా దృష్టి శ్రమించడం పైనే ఉండేది. సొంత కష్టంతోనే ముందుకు సాగాలని, మరో మార్గం లేదని నాకు ఆయన వ్యక్తిత్వం వల్లే అర్థమైంది. దానిపైనే ఎక్కువగా దృష్టి సారించా. నాన్న నిర్ణయాల వల్లే నా కెరీర్ సులభంగా సాగింది. అందుకే ఆయనే నా సూపర్ హీరో' అని కోహ్లీ పేర్కొన్నాడు.

సాకులు చెప్పడం మానేశా
'బాగా కష్టపడి ముందుకొచ్చా. నేను విజయవంతం అయ్యానంటే నా జీవితం మారుతుంది. లేదంటే నేను బాగా ఆడనట్టే. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సాకులు చెప్పడం మానేశా. ఇది మా నాన్న వల్లే సాధ్యమైంది. నా జీవితంలో సాధించిన విజయాలన్నీ మా నాన్న వల్లే జరిగాయి' అని కోహ్లీ తన తండ్రిని గుర్తుచేసుకున్నాడు.

హాలిడే వెకేషన్
తీరికలేని క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ వచ్చే నెల 3 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. అయితే నవంబర్ 14 నుండి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ జట్టుతో కలుస్తాడు. ఈ ఖాళీ సమయంలో కోహ్లీ తన భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో సరదా సమయం గడుపుతూ.. ఆమె ప్రేమలో తడిచి ముద్దవుతున్నాడు. తాజాగా అనుష్కతో కలిసి కోహ్లీ విహార యాత్రకు వెళ్ళాడు. దీనికి సంబందించిన పోటోలను కోహ్లీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.


Click it and Unblock the Notifications












