Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎక్క‌డ ఆపానో.. అక్క‌డి నుంచే మళ్లీ మొదలు పెడుతా: కోహ్లీ

Virat Kohli said I Will be in a Good Position to Start From Where we Left

ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్లేయర్స్ అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ లాక్‌డౌన్ సమయాన్ని ప్రతి ఒక్క ప్లేయర్ ఆస్వాదిస్తున్నారు. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో.. ప్లేయర్స్ సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీవీ వ్యాఖ్యాత జ‌తిన్ స‌ప్రూతో లైవ్ చాట్ నిర్వ‌హించాడు. ఇందులో భాగంగా అభిమానుల నుంచి సేక‌రించిన ప్ర‌శ్న‌ల‌కు కోహ్లీ బ‌దులిచ్చాడు.

ఎక్కడ ఆపానో.. అక్కడ నుంచే మళ్లీ స్టార్ట్ చేస్తా:

ఎక్కడ ఆపానో.. అక్కడ నుంచే మళ్లీ స్టార్ట్ చేస్తా:

మునుపటి లయని అందుకోవాలంటే కనీసం నెల రోజులు ప్రాక్టీస్ అవసరమని అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటని ఓ అభిమాని అడగ్గా.. 'ఈ బ్రేక్ సమయంలోనూ నేను పాజిటివ్‌గా ఉన్నాను. మళ్లీ నేను గేమ్‌లోకి రాగానే మునుపటి తరహాలోనే రాణిస్తానని నమ్మకం ఉంది. ఆట ఎక్కడ ఆపానో.. మళ్లీ అక్కడి నుండే మొదలు పెడుతా' అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైనా.. సానుకూల దృక్ప‌థంతోనే ముందుకు సాగుతున్నా అని పేర్కొన్నాడు.

 నెగిటివ్ ఆలోచ‌న‌ల‌ను ద‌రిచేర‌నివ్వను:

నెగిటివ్ ఆలోచ‌న‌ల‌ను ద‌రిచేర‌నివ్వను:

కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలల నుంచి క్రికెటర్లు ఆటకి దూరంగా ఉంటున్నారు. దాంతో.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ టచ్ పోయిందని రోహిత్ శర్మ, మొహమ్మద్ షమీ, అజింక్య రహానెలు అంటున్నారు. మునుపటి లయని అందుకోవాలంటే కనీసం నెల రోజులు ప్రాక్టీస్ అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ.. విరాట్ కోహ్లీ మాత్రం తాను ఇప్పటికీ మంచి పొజిషన్‌లోనే ఉన్నానని చెపుతున్నాడు. నేనెప్పుడు ఆశావాహంగానే ఆలోచిస్తా.. నెగిటివ్ ఆలోచ‌న‌ల‌ను ద‌రిచేర‌నివ్వ‌నన్నాడు.

ఐపీఎల్ నిరవధిక వాయిదా:

ఐపీఎల్ నిరవధిక వాయిదా:

అన్ని బాగుంటే ఈ పాటికి ఐపీఎల్ లీగ్ చివరి అంకానికి చేరుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభంకావాల్సి ఉండగా.. దేశంలో కరోనా వైరస్ కారణంగా తొలుత ఏప్రిల్ 15కి టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. ఏప్రిల్ 15 నాటికి కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. కేంద్రం లాక్‌డౌన్‌ను మరోసారి పొడగించడంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. టోర్నీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేం.

కోహ్లీ దిగ్భ్రాంతి:

కోహ్లీ దిగ్భ్రాంతి:

విశాఖపట్నం ఎల్‌జీ గ్యాస్‌ లీకేజీ ఘటనపై విరాట్‌ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కోహ్లీ స్పందిస్తూ... ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిలు వెంటనే కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ విరాట్‌ ట్వీట్‌ చేశాడు. గురువారం ఉదయం విశాఖలో చోటుచేసుకున్న ఎల్‌జీ పాలిమర్‌ కర్మాగారం నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలో 11 మంది మృతి చెందగా.. ఈ కర్మాగారం చూట్టుపక్కల సమీపంలో నివస్తిస్తున్న సుమారు 1,000 మంది అస్వస్థతకు గురియ్యారు.

Story first published: Friday, May 8, 2020, 8:44 [IST]
Other articles published on May 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+