కోహ్లీ మరో ఘనత: ‘10వేల’ గెలుపులో సచిన్, ద్రావిడ్ సరసన చేరిక
కోల్‌కతా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత్ అన్ని ఫార్మాట్లలో కలిపి విజయాలు సాధించిన మ్యాచ్‌ల్లో అతను 10 వేల పరుగులు పూర్తి చేయడం విశేషం. ఈ మ్యాచ్‌ల్లో అతడి పరుగుల సంఖ్య 10,059కి చేరుకుంది.
గురువారం ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా విరాట్ 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ మాత్రమే భారత్ తరఫున ఈ ఘనత సాధించడం గమనార్హం.

భారత్ గెలిచిన మ్యాచ్‌ల్లో సచిన్ 17,113 పరుగులు చేయగా, ద్రవిడ్ 10,860 పరుగులు సాధించాడు. టెస్టుల్లో భారత్ గెలిచిన మ్యాచ్‌ల్లో 2,472 పరుగులు చేసిన కోహ్లీ.. వన్డేల్లో 6,313 పరుగులు నమోదు చేశాడు. టీ20ల్లోనూ కోహ్లి 1,274 పరుగులతో భారత్ విజయానికి తోడ్పడ్డాడు.
ఇక వీరేంద్ర సెహ్వాగ్ (9,372), గంగూలీ (9,102), ధోనీ (8,393)లు కోహ్లీ వెనకున్నారు. కోహ్లీ 28వ యేటే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. భారత్ విజయాలు సాధించిన మ్యాచ్‌ల్లో కోహ్లీ సగటు 67.96 శాతంగా ఉండటం మరో విశేషం. పరుగుల యంత్రాంగ పేరుతెచ్చుకున్న కోహ్లీ.. మరిన్ని రికార్డుల దిశగా కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications