69వ పడిలోకి ప్రధాని మోడీ: సచిన్, కోహ్లీ స్పెషల్ మేసేజ్

హైదరాబాద్: నరేంద్ర మోడీ... ఈ పేరులో ఏదో వైబ్రేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాధినేతలు సైతం మోడీ అనే పేరును ఎంతో గౌరవిస్తారు. ఒకప్పుడు అమెరికా వెళ్లేందుకు వీసా నిరాకరించిన దేశమే నేడు తమ దేశానికి రావాల్సిందిగా రెడ్‌కార్పెట్ పరుస్తోంది. అంతలా మోడీ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన నరేంద్రుడు అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేతగా ఎదిగారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ తన 69వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మోడీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం ప్రధాని మోడీకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్.. మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌లు ఉన్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా
తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం తల్లి హీరాబెన్ వద్ద ప్రధాని మోడీ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నర్మద జిల్లాలో పూజలు నిర్వహించారు. నమామీ దేవి నర్మద మహోత్సవ్ ఉత్సవాలను గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ కూడా నర్మద వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ
తర్వాత బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అంతకుముందు కెపాడియా పార్క్‌లో సఫారీ టూర్ కూడా చేశారు మోడీ. మోడీ జన్మదినాన్ని పురష్కరించుకొని సేవా వారంగా బీజేపీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజులు వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications