కోహ్లీకి అరుదైన గౌరవం: లార్డ్స్‌లో మైనపు విగ్రహం

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీకి ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. వరల్డ్‌కప్‌కు ముందు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ నిర్వాకులు బుధవారం ఆవిష్కరించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కోహ్లీ మైనపు విగ్రహం టీమిండియా కిట్‌ను ధరించి ఉంది. తాజా విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఉస్సేన్ బోల్ట్, మో ఫరా, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాల సరసన విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, 12వ వరల్డ్‌కప్ ఎడిషన్ అధికారికంగా బుధవారం ప్రారంభమైంది. మాల్ రోడ్డులో ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

మాల్‌లో ప్రారంభ వేడుకలు
బకింగ్‌హామ్ ప్యాలెస్ దగ్గరలోని ప్రఖ్యాత మాల్‌లో ప్రారంభ వేడుకలను ఘనంంగా నిర్వహించారు. దాదాపు గంటసేపు జరిగిన కార్యక్రమం అభిమానులను అలరించింది. ఈ ప్రారంభ వేడుకలకు క్రికెట్ అభిమానులు వేలాదిగా తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. పది జట్ల కెప్టెన్లు బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ను కలుసుకున్నారు.

ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ vs దక్షిణాప్రికా
టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో ఆతథ్య ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదిక కానుంది. గురువారం నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999).

20 ఏళ్ల తర్వాత
సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. ఈ 12వ ఎడిషన్ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఐసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

11 వేదికల్లో 46 రోజుల పాటు
యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి.

రౌండ్ రాబిన్ పద్ధతిలో
1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications