హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14 (మంగళవారం)నాడు వాలంటైన్స్ డేని ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. వాలంటైన్స్ డేని పురస్కరించుకుని ప్రేమ జంటలు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నాయి.

అయితే వరుస సిరిస్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వాలంటైన్స్ డేని తన ప్రేయసి బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మతో బుధవారం జరుపుకున్నాడు. ఇద్దరూ కలిసి దిగిన ఓ సెల్ఫీని తొలిసారిగా విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
అనుకోవాలేగానీ.. ప్రతి రోజు వాలెంటైన్స్ డేనే... నా ప్రతిరోజును నువ్వు అలా మార్చేశావ్.. అంటూ అనుష్కను ఉద్దేశించి విరాట్ కోహ్లీ కామెంట్ పోస్టు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ పోస్టుకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.