For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గోల్డన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: అనుష్కపై కోహ్లీ 'SHAME'

తన పేలవ ప్రదర్శనకు అనుష్క శర్మయే కారణమంటూ సోషల్ మీడియా వచ్చిన ట్వీట్లకు గాను టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ SHAME అంటూ చేసిన ట్వీట్ గోల్డన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది.

By Nageshwara Rao

హైదరాబాద్: తన పేలవ ప్రదర్శనకు అనుష్క శర్మయే కారణమంటూ సోషల్ మీడియా వచ్చిన ట్వీట్లకు గాను టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ SHAME అంటూ చేసిన ట్వీట్ గోల్డన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది. 2016 సంవత్సరానికి గాను అత్యంత ప్రభావవంతమైన ట్వీట్లను ట్విట్టర్‌ ఇండియా విడుదల చేసింది.

Virat Kohli's tweet shaming Anushka Sharma

ఈ జాబితాలో అత్యంత ప్రభావవంతమైన ట్వీట్‌గా కోహ్లి అనుష్కను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ నిలిచింది. టీ20 మ్యాచ్‌ల్లో తన వైఫల్యానికి అనుష్కనే కారణమంటూ నెటిజన్లు ఆమెను కించపరచడాన్ని తప్పుబడుతూ కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యను లక్షా ఏడువేలమందికిపైగా లైక్‌ చేశారు.

అనుష్కకు మద్దతుగా కోహ్లి తొలిసారి పోస్టు చేసిన ఈ ఫేస్‌బుక్‌లో కూడా వైరల్ అయింది. అందులో కోహ్లీ 'అనుష్కశర్మను నిరంతరం కించపరుస్తున్న మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా. కొంచెం కనికరం చూపండి. ఆమె నాకు ఎప్పుడూ సానకూల శక్తినే ఇచ్చింది' అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Virat Kohli's tweet shaming Anushka Sharma haters termed 'most influential tweet' of 2016

ఇక ఈ ట్వీట్‌ ట్విట్టర్‌లో రికార్డుస్థాయిలో 39 వేల సార్లు రీట్వీట్‌ అయింది. ఆసక్తికరంగా కోహ్లీ ట్వీట్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్‌ను కూడా అధిగమించడం గమనార్హం. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్‌‌లో చేసిన ఓ ట్వీట్‌ ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన ట్వీట్లలో రెండోస్థానంలో నిలిచింది.

నోట్ల రద్దుపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక మూడో ప్రభావవంతమైన ట్వీట్‌గా 2016 టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్‌ నిలిచింది. నాలుగో స్థానంలో రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించిన దీపా కర్మాకర్‌, సాక్షి మాలిక్‌, పీవీ సింధు నిలిచారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+