క్లీన్ స్వీప్: చరిత్ర సృష్టించేందుకు ఒక టెస్టు దూరంలో టీమిండియా!

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగిలుండగానే టీమిండియా సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి మంచి జోరు మీదున్న టీమిండియా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరిస్‌లను నెగ్గిన ఏకైక జట్టుగా సృష్టించింది.
అయితే, తాజాగా మరో రికార్డు టీమిండియాను ఊరిస్తోంది. టెస్టుల్లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా... భారత్‌లో జరిగిన టెస్టుల్లో మాత్రం టీమిండియాదే పైచేయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా ఒకే ఒక్క సిరిస్‌ను కోల్పోయింది. మొత్తంగా ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికా 15 విజయాలు సాధించగా, భారత్ 13 విజయాలు సాధించింది.

రాంచీ వేదికగా మూడో టెస్టు
ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య రాంచీ వేదికగా శనివారం మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గనుక టీమిండియా విజయం సాధిస్తే దక్షిణాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసిన అరుదైన రికార్డు నెలకొల్పుతుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై జట్టు కూడా క్లీన్ స్వీప్ చేయలేదు.

టీమిండియాకు గొప్ప ఛాన్స్
2015లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా టీమిండియాకు అవకాశం వచ్చింది. అయితే, బెంగళూరు వేదికగా జరగాల్సిన రెండో టెస్టు వర్షం కారణంగా రద్దు కావడంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియాను 3-0తో కైవసం చేసుకుంది. అందులో మూడు టెస్టులను భారత్ గెలవగా, ఒక టెస్టు డ్రా అయ్యింది.

దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా
మళ్లీ నాలుగేళ్ల తర్వాత టీమిండియాకు ఆ అవకాశం మళ్లీ వచ్చింది. రాంచీ టెస్టులో టీమిండియా గెలిస్తే దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. మూడు లేదా అంతకుమించి మ్యాచ్‌ల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల ఇదే తొలి వైట్‌వాష్ సిరిస్ అవుతుంది. దీంతో సఫారీలను క్లీన్‌స్వీప్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications