
హైదరాబాద్: విరాట్ కోహ్లీ రెండో రిసెప్షన్‌కి కేవలం సెలబ్రిటీలనే పిలిచాడు అనుకునే వాళ్లందరూ బురిడీ కొట్టినట్టే. తను అండర్-19నుంచి తనని ఫాలో అవుతున్న ఓ అభిమానిని ప్రత్యేక ఆహ్వానంతో పిలిపించాడు కోహ్లీ. డిసెంబరు 26 మంగళవారం జరిగిన రెండో రిసెప్షన్ వేడుకకు శ్రీలంకకు చెందిన దివ్యాంగుడైన ఓ అభిమానిని ఆహ్వనించాడు.
ఎవ్వరికీ చెప్పకపోయినా స్నేహితులకు
మీడియాలో గుసగుసలు, ఆన్‌లైన్‌లో రూమర్లు ఏవీ పట్టించుకోకుండా ఇటలీకి వెళ్లి పెళ్లి చేసుకుంది ఈ ప్రేమ జంట. కుటుంబ సభ్యులకే కాదు స్నేహితులను సైతం తన పెళ్లి వేడుకకు తీసుకెళ్లాడు కోహ్లీ. ఇప్పుడు సెలబ్రిటీలతో పాటు తన చిరకాల అభిమానిని ఆహ్వానించి తనలోని ఔన్నత్యాన్ని మళ్లీ చాటుకున్నాడు.
మన దేశం కాదు.
తన రిసెప్షన్‌కు భారత్‌కు చెందిన వాళ్లని పిలిస్తే అదో రకం. కానీ, పరాయిదేశం, ప్రత్యర్థి దేశమైన శ్రీలంకకు చెందిన అభిమాని గయాన్ సెననాయకేను ఆహ్వానించాడు. దివ్యాంగుడైన గయాన్ సెననాయకే రిసెప్షన్‌కు హజరై విరుష్కకు శుభాకాంక్షలు తెలిపాడు.
భారత్-శ్రీలంక సిరీస్ సందర్భంగా శ్రీలంక జట్టుతో ఇక్కడికి వచ్చిన గయాన్‌ను కోహ్లి తన రిసెప్షన్‌కు రావాలని ఆహ్వానించాడట. అంతటి స్టార్ ఆటగాడు పిలిస్తే రాకుండా ఉంటాడా. అది తన అభిమాన క్రికెటర్. ముంబైలో జరిగిన రిసెప్షన్‌కు హజరైన గయాన్ భారత క్రికెటర్లతో సందడి చేశాడు. విరుష్కతో ఫొటో దిగాడు.
అండర్-19 ప్రపంచకప్ ముందు నుంచి..
కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాక ముందే తనకు తెలుసన్న గయాన్.. తొలి సారి అండర్-19 ప్రపంచకప్ ముందు 2007లో శ్రీలంకకు వచ్చి కోహ్లిని కలిసానన్నాడు. అప్పటి నుంచి లంకకు వచ్చినప్పుడల్లా టచ్‌లో ఉండేవాడినని తెలిపాడు. రిసెఫ్షన్‌కు రావడం ఆనందంగా ఉందని, కోహ్లి నాకు మంచి స్నేహితుడని గయాన్ చెప్పుకొచ్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.