For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

11ఏళ్ల తర్వాత మళ్లీ ఆ గడ్డపై ఆడేందుకు సిద్ధమైన టీమిండియా

Virat Kohlis selection in Indian squad for Ireland T20s creates confusion as dates clash with his county commitments

హైదరాబాద్: ఐపీఎల్ అనంతరం టీమిండియాను విదేశీ పర్యటనకు సంసిద్ధం చేస్తుంది బీసీసీఐ. ఈనేపథ్యంలోనే ఐర్లాండ్‌కు వెళ్లనున్న జట్టును తేదీ తదితర వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా జట్టు 11 ఏళ్ల తరువాత మళ్లీ ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ-20 మ్యాచ్‌ల నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది.

ఐర్లాండ్ దేశ రాజధాని డబ్లిన్‌లో జూన్ 27, 29 తేదీల్లో జరగనున్న రెండు టీ-20 మ్యాచ్‌‌ల్లో ఐర్లాండ్, భారత్ జట్లు తలపడనున్నాయి. అదే టీమిండియా జట్టు ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లోనూ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా జట్టు వివరాలను వెల్లడించింది.

ఐర్లాండ్, ఇంగ్లాడ్ టూర్‌లో ఆడనున్న టీమిండియా జట్టు సభ్యులు వీరే..: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ఎల్ రాహుల్, రైనా, మనీష్, ఎంఎస్ ధోని, దినేష్ కార్తిక్, చాహల్, కుల్‌దీప్, సుందర్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హర్దిక్, కౌల్, ఉమేష్ ఉన్నారు.

భారత్‌ చివరిసారి 2007లో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌ జట్టుతో వన్డే ఆడింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 9 వికెట్లతో విజయం సాధించింది. తర్వాత 2009 టి20 ప్రపంచకప్‌ సందర్భంగా నాటింగ్‌హామ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి.

Story first published: Wednesday, May 9, 2018, 14:01 [IST]
Other articles published on May 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+