
హైదరాబాద్: పెళ్లైన కొన్నాళ్లకే పర్యటనకు బయల్దేరి దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడు కోహ్లీ. అనుష్క సైతం సినిమా షూటింగుల్లో బిజీ అయిపోయింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసినందుకు కోహ్లీని అనుష్క ఇలా అభినందించింది.
అయితే సుదీర్ధ కాలం తర్వాత కలిసిన ఆ జంట ఉద్వేగానికి లోనైంది. ఇద్దరూ గాఢంగా కౌగిలించుకున్న సందర్భంలో కెమెరా క్లిక్ అంది. ఆ ఫోటోను కోహ్లీనే తన అధికారికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు. అంతేకాదు, దాంతో పాటు వన్ అండ్ ఓన్లీ అని కామెంట్ కూడా రాశాడు. ప్రస్తుతం తన ప్రదర్శన మెరుగుపడడానికి తన భార్య అనుష్కనే కారణమని విరాట్ ఆఖరి వన్డే అనంతరం మీడియా ముందు వెల్లడించాడు.
వన్డే క్రికెట్ కెరీర్‌లో 35వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ ఆనందంలో మునిగితేలాడు. ఈ సెంచరీతో పాటుగా వన్డే మ్యాచ్‌ను గెలవడంతో సిరీస్ చేజిక్కింది. ఐదో వన్డే మ్యాచ్‌కే సిరీస్ కైవసం చేసుకున్నా.. ఆఖరు మ్యాచ్ సైతం విజయంతోనే ముగిస్తామంటూ కోహ్లీ ముందే పేర్కొన్నాడు. అన్నట్లుగానే టార్గెట్‌ను అలవోకగా చేధించి జట్టును విజయం వైపుకు నడిపించాడు
అయితే ఈ క్రెడిట్ అంతా సతీమణి అనుష్క శర్మకే దక్కుతుందంటూ పొగడ్తలన్నీ ఆమెకే ఆపాదించాడు కోహ్లీ. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'క్రీడాకారులు ఆడటానికి స్టేడియం బయట ఉన్న వ్యక్తులు ఇచ్చే ప్రేరణ చాలా విలువైనది. అలానే నా భార్య నాకిచ్చిన ప్రేరణతో ఈ గొప్పదనమంతా తనకే దక్కాలి' అని పేర్కొన్నాడు.
కాలికి గాయం కావడంతో బుధవారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులో ఉంటాడా..లేదా..? అన్నది సందిగ్ధంగా మారింది.