'క్రికెట్ విషయంలో కోహ్లీ అభిరుచి, శక్తికి మరొకరు సాటి రాలేరు'

హైదరాబాద్: క్రికెట్ పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న అభిరుచి, శక్తికి మరొకరు సాటి రాలేరని హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ప్రతిరోజు తనను తాను కోహ్లీ ఎంతగానో మెరుగుపరచుకుంటూనే ఉన్నాడని తెలిపాడు. తన ఆట తీరుతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడని కోహ్లీపై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.
తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ "కోహ్లీ ప్రతిరోజూ మెరుగవుతున్నాడు. ఆట పట్ల అతడికి ఉన్న అభిరుచి, శక్తికి మరొకరు సాటి రాలేరు. అలాంటి కెప్టెన్‌ను కూడా ఇంతకు మునుపెన్నడూ నేను చూడలేదు. వ్యూహాత్మకంగా అతడు ఎదుగుతున్నాడు. అనుభవంతో మరింత మెరుగవుతాడు. ప్రతి ఒక్కరికి బలం, బలహీనత ఉంటాయి" అని అన్నాడు.

కొంతమంది కెప్టెన్లకు ఒక విభాగంలోనే
"నిజానికి కొంతమంది కెప్టెన్లకు ఒక విభాగంలో బలముంటే మిగతా విభాగాల్లో అంత పట్టు ఉండకపోవచ్చు. కానీ, కోహ్లీ మాత్రం అందుకు భిన్నం. విభిన్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు. అతడు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకుపోతున్న విధానం అద్భుతం" అని కోహ్లీపై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.

టెస్టు క్రికెట్‌కు ప్రచారం కల్పించేందుకు
"టెస్టు క్రికెట్‌కు ప్రచారం కల్పించేందుకు కోహ్లీ కంటే మెరుగైన వారు మరొకరు లేరు. టెస్టు క్రికెట్ ఆడటాన్ని అతడు ప్రేమిస్తాడు. గొప్ప ఆటగాడు సుదీర్ఘ ఫార్మాట్‌పై ఎక్కువ దృష్టిసారించడాన్ని యువ క్రికెటర్లు చూస్తే ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్ అని తేడా లేకుండా అనుకరిస్తారు. ఆటను అంతగా ప్రేమిస్తాడు కాబట్టే అతడు ప్రదర్శన అలా ఉంటుంది" అని శాస్త్రి అన్నాడు.

2014 తర్వాత జట్టులో సాంకేతికంగా
కాగా, 2014 తర్వాత జట్టులో సాంకేతికంగా ఎలాంటి మార్పు రాలేదన్న రవిశాస్త్రి... దేశాన్ని ప్రేమించడంతో పాటు ఒక జట్టుగా గెలవడం కూడా నేర్చుకున్నారని వెల్లడించాడు. కాగా, నూతన సంవత్సరంలో టీమిండియా తన తొలి సిరిస్‌ను శ్రీలంకతో ప్రారంభించనుంది. జనవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications