Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Brand Endorsements: కోహ్లీ పారడీ అకౌంట్ నుంచి ఆసక్తికర ట్వీట్లు

Virat Kohli’s parody account takes a humurous dig at his brand endorsements

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో 453 పరుగులు చేసి... వెస్టిండిస్ జట్టుపై అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

అనంతరం అదే విండిస్‌తో ప్రారంభమైన మూడు టీ20ల సిరిస్‌ నుంచి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. సోమవారం (నవంబర్ 5)న తన 30వ పుట్టినరోజుని జరుపుకున్న కోహ్లీపై సోషల్ మీడియాలో అతడి ప్రచాకర్తగా ఉన్న బ్రాండ్‌లపై నెటిజన్లు ట్రోల్ చేశారు.

విరాట్ కోహ్లీ అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఆయా బ్రాండ్లకు సంబంధించిన ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తించారు. విరాట్ కోహ్లీ పుట్టినరోజుని పురస్కరించుకుని అధికారిక మొబైల్ యాప్‌ను విడుదల చేశారు.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై ఈ యాప్ లభిస్తోంది. ఈ యాప్ ద్వారా కోహ్లీ అభిమానులు అతడికి చెందిన తాజా వార్తాలతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సాధించిన అనేక రికార్డులను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా కోహ్లీతో నేరుగా నేరుగా సంభాషణ జరపవచ్చు.

కోహ్లీకి చెందిన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా ఈ యాప్‌కి అనుసంధానం చేశారు. తాజాగా విరాట్ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్‌లో ఆక్స్ మీ ఎనీథింగ్(AMA) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫీచర్ ద్వారా కోహ్లీ తన బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాడని ఫ్యాన్స్ గ్రహించారు.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ప్రచారకర్తగా ఉన్న బ్రాండ్లకు సంబంధించి అనేక ట్వీట్లను అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో కొన్ని ఆసక్తికర ట్వీట్లు మీకోసం....

Story first published: Tuesday, November 6, 2018, 15:28 [IST]
Other articles published on Nov 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+