షాక్: పాకిస్తాన్లోని కోహ్లీ అభిమానికి 10 ఏళ్ల జైలు శిక్ష!
లాహోర్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అంటే పడిచచ్చే అతని పాకిస్తాన్ అభిమానికి స్థానిక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించినట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదో వన్డేలో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. దీనిని ఇరవై రెండేళ్ల పాక్ అభిమాని ఉమర్ డ్రాజ్.. భారత జెండాను ఎగరేవేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో అతనికి శిక్ష పడింది.
పాక్‌కు చెందిన ఉమర్ ద్రాజ్‌కు విరాట్ కోహ్లి అంటే అభిమానం. భారత మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసినందుకు అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై తొలి టీ-20 మ్యాచ్‌లో కోహ్లి విజృంభించడంతో ఆయన వీరాభిమాని అయిన ఉమర్ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

పాక్ పంజాబ్ ప్రావిన్సులోని తన ఇంటిపై సంతోషంతో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. భారత్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జెండాపై సమాచారం అందుకున్న పోలీసులు ఉమర్ ఇంటిలో తనిఖీలు నిర్వహించారు.
అనంతరం అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ శిక్షా స్మృతిలోని దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే నిబంధనల ఆధారంగా కేసు నమోదు చేశారు. కోహ్లిపై అభిమానాన్ని చాటిచెప్పేందుకు భారత పతాకాన్ని ఎగురవేశానని, ఇది నేరమని తనకు తెలియదని ఉమర్ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications