Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ మెదడు ఓ కంప్యూటర్: ధోనికి అనుకోని ప్రశంస

మొహాలి: మొహాలిలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన కెరీర్‌లో 26వ సెంచరీని పూర్తి చేశాడు. పరుగుల ఛేజింగ్‌లో అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ 166 ఇన్నింగ్సుల్లో 26 సెంచరీలు సాధిస్తే, క్రికెట్‌ దిగ్గజాలైన సచిన్‌ 247, రికీ పాంటింగ్‌ 286, జయసూర్యకు 402 ఇన్నింగ్స్‌లు పట్టడం విశేషం.

కోహ్లీ బ్యాటింగ్ శైలిలో ఓ స్టయిల్ ఉంటుందని గవాస్కర్ తెలిపాడు. కోహ్లీలోని కచ్చితత్వమే అతని బ్యాటింగ్‌ను స్థాయిని అమితంగా పెంచిందని కొనియాడాడు. అంతేకాదు కోహ్లీ మెదడు ఒక కంప్యూటర్ మాదిరి పని చేస్తుందని చెప్పడానికి మూడో వన్డేలో ఆడిన ఇన్నింగ్సే ఉదాహరణ అని పేర్కొన్నాడు.

Virat Kohli 's Mind Works Like Computer: Sunil Gavaskar


'కోహ్లి మెదడు కంప్యూటర్ లాగా పని చేస్తుంది. ఫీల్డర్లను మోహరించిన చోట కూడా అతని కచ్చితమైన కొలతలతో కొట్టే షాట్లు ఫీల్డర్లనే అయోమయంలో నెడుతుంటాయి. ఆ రకమైన ఆట తీరే అతను భారీ స్కోర్లు సాధించడానికి ఉపయోగపడుతుంది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

మరోవైపు మైదానంలో కోహ్లీ ప్రవర్తించే తీరు కూడా చాలా హుందాగా ఉంటుందని అన్నాడు. 'మంచి మనిషి. అభిమానుల్ని, ప్రజల్ని ఆప్యాయంగా పలకరించే తీరే అతనిలో మానవీయ లక్షణాలను తెలుపుతుంది. యువ క్రికెటర్లకు కోహ్లో ఓ రోల్ మోడల్' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

మొహాలి వన్డేలో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. 'ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావడానికి అతనే కారణం. ఆ స్థానంలో బ్యాటింగ్ రావాల్సి ఉన్న మనీష్ పాండే, కేదర్ జాద‌వ్‌లు టాలెంట్ ఉన్న క్రికెటర్లే. కానీ వారికి అనుభవం తక్కువ. దాంతో ఆస్థానంలో బ్యాటింగ్ కు రావాలని ధోని తీసుకున్న నిర్ణయం సరైనది. 2011లో వరల్డ్ కప్ గెలిచిన సమయంలో కూడా ధోని ఇలానే ముందుకు వచ్చాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ రావాల్సిన యువీని పక్కకు పెట్టి, ధోని వచ్చాడు. అప్పటి బాధ్యత ధోనిలో మరోసారి కనిపించింది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

కాగా, మూడో వన్డేలో ధోనీ 80 పరుగుల వద్ద ఔటవ్వగా, కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందజంలో ఉంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం రాంచీలో జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+