Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అటాక్, అటాక్, అటాక్: చాహల్‌కు కోహ్లీ చేసిన సూచన ఇదే

హైదరాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాను విజయవంతం అవడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయేనని మణికట్టు స్ఫిన్నర్ యజువేంద్ర చాహాల్ అన్నాడు. భారత లెగ్ స్పిన్నర్‌గా రాణిస్తున్న చాహల్ గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. తన విజయాల వెనుక ప్రధాన పాత్ర కోహ్లీదేనని ఓ ఇంటర్యూలో చాహల్ చెప్పుకొచ్చాడు.

బ్యాట్స్‌మెన్‌కు నిర్భయంగా బంతులు విసిరేలా కోహ్లీ ప్రేరణ కలిగించి ఆత్మవిశ్వాసం నింపుతాడని పేర్కొన్నాడు. ఎటాక్‌ చేయడమే లక్ష్యంగా ముందుకు నడిపిస్తాడని తెలిపాడు. 'విరాట్ కోహ్లీ నాపై అపార నమ్మకం ఉంచాడు. అందుకే నేను ఏ మాత్రం భయపడకుండా బౌలింగ్ చేస్తున్నా. అతడి స్ఫూర్తితోనే అటాకింగ్ బౌలింగ్ చేస్తున్నా' అని చాహల్ అన్నాడు.

వికెట్లు తీస్తే చాలు కోహ్లీ సంతోషిస్తాడు

వికెట్లు తీస్తే చాలు కోహ్లీ సంతోషిస్తాడు

ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 6 వికెట్లు తీసిన చాహల్ కివీస్‌తో జరిగిన వన్డేల్లో 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ‘నేను పరుగులు ఎక్కువగా ఇచ్చినా విరాట్ భాయ్ ఇబ్బంది పడడు. పరుగులిచ్చినా మధ్య ఓవర్లలో కీలక వికెట్లు తీస్తే ఫర్వాలేదని విరాట్‌ భాయ్‌ నాతో ఎప్పుడూ చెప్తుంటారు. టీ20ల్లోనైతే 4 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చినా రెండు, మూడు వికెట్లు తీస్తే చాలు కోహ్లీ సంతోషిస్తాడు' అని తెలిపాడు.

8 ఓవర్ల మ్యాచ్ కావడంతో అలా చేశా

8 ఓవర్ల మ్యాచ్ కావడంతో అలా చేశా

తిరువనంతపురంలో జరిగిన చివరి టీ20లో తనకు ఎదురైన అనుభవం గురించి చాహల్ వివరించాడు. ‘నేను వేసిన రెండో ఓవర్లో పరుగులు ఇవ్వకుండా నియంత్రించడానికే ప్రయత్నించా. ఒక వేళ వికెట్ల కోసం ప్రయత్నిస్తే గాల్లో బంతిని ఫ్లయిట్ చేయాలి. అదే జరిగితే వికెట్ దక్కొచ్చు లేదంటే సిక్సర్ ఇవ్వాల్సి రావొచ్చు. 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో పరుగులు ఇవ్వకుండా చూడటమే ముఖ్యం అనుకున్నా. ఆ దిశగానే ప్రయత్నించా' అని చాహల్ తెలిపాడు.

మహీ భాయ్‌ పరిస్థితిని చక్కగా విశ్లేషించగలరు

మహీ భాయ్‌ పరిస్థితిని చక్కగా విశ్లేషించగలరు

‘మిడిల్‌ స్టంప్‌పై దాడి చేసేందుకు మా కోచింగ్‌ సిబ్బంది ఎప్పుడూ సాయపడుతుంటారు. ఇక మైదానంలో మహీ భాయ్‌ పరిస్థితిని చక్కగా విశ్లేషించగలరు. ఆ వెంటనే ఏం చేయాలో చెప్తారు. ఆఫ్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతుల్లో వైవిధ్యం ఉంటుంది కానీ కచ్చితమైన ప్రదేశంలో బంతిని పిచ్‌ చేయడమే నా బలం. అదే సమయంలో బంతిని మెల్లగా వేసి టర్న్‌ రాబట్టి బ్యాట్స్‌మెన్‌ను గందరగోళంలోకి నెట్టేస్తా' అని చాహల్ అన్నాడు.

మంచును ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు

మంచును ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు

'నిజానికి మంచు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో బంతిని తిప్పడం చాలా కష్టం. కానీ చాహల్ అలాంటి పరిస్థితుల్లోనూ చక్కగా స్పిన్ చేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలను అనే నమ్మకం ఉండాలి. మానసికంగా దృఢంగా ఉంటే.. మంచును ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు' అని చాహల్ చెప్పాడు. ప్రస్తుతం చాహల్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణలో ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 14:06 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+