For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువ క్రికెటర్లకు కోహ్లీ సందేశం.. 6, 7 స్థానాల్లో ఒత్తిడిని జయించేవారు కావాలి!!

Need Players At Number 6 & 7 To Win Matches Under Pressure! - Virat Kohli
Virat Kohlis message to youngsters: Need players at number 6 and 7 to win matches under pressure

గువాహటి: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ యువ క్రికెటర్లకు ఓ సందేశం ఇచ్చాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచులను ముగించేందుకు మిడిలార్డర్‌ సిద్ధంగా ఉండాలి. 6, 7 స్థానాల్లో ఒత్తిడిని జయించేవారి కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నాడు. టాప్‌ ఆర్డర్‌పై ఆధారపడితే ఐసీసీ టోర్నీలు గెలవలేమన్నాడు. భారత్‌ 2013లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో చివరిసారి ఐసీసీ (ఛాంపియన్స్‌ ట్రోఫీ) టోర్నీ గెలుచుకుంది.

ఆర్డర్‌పైనే ఆధారపడకూడదు

ఆర్డర్‌పైనే ఆధారపడకూడదు

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలో ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. శనివారం విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. '6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌ చేసి మ్యాచులు గెలిపించే ఆటగాళ్లు ఇప్పుడు మనకు కావాలి. బ్యాటింగ్‌ లైనప్‌లో ఎప్పుడూ కూడా టాప్‌ ఆర్డర్‌పైనే ఆధారపడటం మంచిది కాదు. అలా ఉంటే ఐసీసీ టోర్నీలు గెలవలేం. కచ్చితంగా మార్పు తీసుకురావాలి' అని కోహ్లీ అన్నాడు.

ఒత్తిడిని జయించే 6, 7 అవసరం

ఒత్తిడిని జయించే 6, 7 అవసరం

'యువ ఆటగాళ్లు ముందుకొచ్చి మంచి క్రికెట్‌ ఆడాలని కోరుతున్నా. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచులను ముగించేందుకు మిడిలార్డర్‌ సిద్ధంగా ఉండాలి. 6, 7 స్థానాల్లో ఒత్తిడిని జయించేవారి కోసం ఎదురు చూస్తున్నా. ఇక నుంచి జరిగే సిరీస్‌లలో ఒత్తిడిలో ఎవరు నిలుస్తారో చూడాలి. రోహిత్ శర్మ, నాపై ఎక్కువగా ఆధారపడొద్దు. రోహిత్‌, కేఎల్ రాహుల్‌, శిఖర్‌ ధావన్, నేను త్వరగా ఔటైతే మిడిలార్డర్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి' అని కోహ్లీ పేర్కొన్నాడు.

రోహిత్‌ వచ్చాక తలనొప్పే

రోహిత్‌ వచ్చాక తలనొప్పే

'మేనేజ్మెంట్ ఐదారుగురు ఆటగాళ్లను గుర్తించడం మంచిదే. ఎవరు ఆడాలి, ఎవరు బ్యాకప్‌గా ఉండాలన్నది పిచ్, మ్యాచ్ ప్రాధాన్యాన్ని బట్టి ఉంటుంది. పేసర్లు తరచూ గాయపడుతుంటారు. ప్రస్తుతం ఎక్కువ మంది బౌలర్లు ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. శ్రీలంక సిరీస్‌లో రాహుల్‌, ధావన్‌ ఓపెనింగ్‌ చేస్తారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్‌ వచ్చాక జట్టు కూర్పును బట్టి ఎంపిక ఉంటుంది. ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించడం చాలా కష్టం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

విఫలమైతే విమర్శించొద్దు

విఫలమైతే విమర్శించొద్దు

'కొత్త సంవత్సరంలో తొలి మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి ఆటగాళ్లతో మాట్లాడాను. అందరు సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మూడేళ్లలో మా మానసిక ధోరణి ఎంతో మారింది. ఎవరైనా ఆటగాడు విఫలమైతే విమర్శించొద్దు. కొన్ని అవకాశాల తర్వాత మాట్లాడదాం. వైఫల్యం గురించి బాధపడొద్దు' అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Sunday, January 5, 2020, 16:25 [IST]
Other articles published on Jan 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+