ముంబై: వరల్డ్ టీ20 వరల్డ్ కప్ భారత్‌దే. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు క్రీడా విశ్లేషకులు మాట ఇది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, ఒత్తిడిని జయించే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి క్రీడాకారులున్న టీమిండియాలో ఉండటంతో ఆ అర్హత ఉందన్నది వారి భావన.
అంతేకాదు వారి అంచనాలను నిజం చేస్తూ టీమిండియా సెమీస్ చేరింది. అయితే సెమీస్‌లో స్వయంకృతాపరాధంతో ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించలేకపోయింది. గురువారం రాత్రి వాంఖడే మైదానంలో వీరవిహారం చేసిన విరాట్ కోహ్లీ... కేవలం 47 బంతుల్లోనే 83 పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్‌ను కూడా తీసుకున్నాడు.
భారత బౌలర్లు చేసిన మూడు తప్పిదాలే కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌ను వృథా చేశాయి. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన కోహ్లీ మైదానంలో ఎంతో నిరాశ చెందాడు. అయితే ఆ తర్వాత అంతే వేగంగా నిర్వేదం నుంచి బయటపడ్డాడు. భారత్ ఓటమిని నుంచి ఒక్క రోజు వ్యవధిలోనే తేరుకున్నాడు.

జట్టు విజయాన్ని ప్రస్తావించని కోహ్లీ... కాశ్మీర్‌కు చెందిన ఆమీర్ హుస్సేన్ లోన్‌కు సంబంధించిన వీడియోను కోట్ చేస్తూ ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఎప్పటికీ విశ్వాసం కోల్పోవద్దు. జీవితానికి ముగింపు లేదు. ప్రారంభం మాత్రమే ఉంది. ఈ యువకుడికి జోహార్లు'' అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.
ఎనిమిదేళ్ల ప్రాయంలో జరిగిన ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఆమిర్... ఆ తర్వాత తనకిష్టమైన క్రికెట్‌కు దూరం కాలేదని కోహ్లీ చెప్పాడు. రెండు చేతులు లేని ఆమిర్... కాలి వేళ్లతో బౌలింగ్ చేయడం... మెడ, భుజం మధ్యలో బ్యాటును పట్టుకుని బ్యాటింగ్ చేయడం, సొంత పనులను స్వయంగా చేసుకుంటున్న ఆమిర్‌ను చూసైనా విశ్వాసాన్ని కోల్పోకూడదని కోహ్లీ సూచించాడు.