Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కోహ్లీసేన బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఓకే... కానీ, బ్యాటింగ్‌లో మాత్రం కాదు'

Ind vs Aus : Kohli's Men India's Best Fast-Bowling, Fielding Team But Not Batting Says Ian Chappell
Virat Kohlis men Indias best fast-bowling, fielding team but not batting: Ian Chappell

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లలో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా ఉందని తెలిపాడు.

అయితే, బ్యాటింగ్‌లో మాత్రం టీమిండియా బలహీనంగా ఉందని, గతంలో ఇంతకంటే బలమైన బ్యాటింగ్ లైనప్‌ను తాను చూసినట్లు ఛాపెల్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.

ఛాపెల్ మాట్లాడుతూ

ఛాపెల్ మాట్లాడుతూ

ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది. తాజాగా 'ESPNCricinfo'కు ఇచ్చిన ఇంటర్యూలో ఛాపెల్ మాట్లాడుతూ "ప్రస్తుత భారత జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో బలోపేతంగా ఉంది. ప్రస్తుత బ్యాటింగ్ కూర్పు బలమైనదే అయినా.. ఇంతకంటే బలమైన భారత బ్యాటింగ్ లైనప్‌ను ఇంతకుముందు చూశాను" అని అన్నాడు.

భారత పేస్ త్రయం అద్భుతం

భారత పేస్ త్రయం అద్భుతం

ఆస్ట్రేలియా గడ్డపై భారత పేసర్ల త్రయం ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించారని కొనియాడాడు. 70 ఆసీస్ వికెట్లలో 50 వికెట్లను ఈ ముగ్గురే పడగొట్టడం అద్భుతమని ప్రశంసించాడు. "ఆస్ట్రేలియా బౌలర్ల కంటే క్రమశిక్షణతో భారత బౌలర్లు బంతులేశారు. మెరుగైన స్వింగ్ రాబడుతూ సరైన ప్రాంతాల్లో బంతులను వేసి ఫలితాన్ని రాబట్టారు" అని చాపెల్ అన్నాడు.

సిరీస్‌ గెలవడం మాత్రం ఇదే తొలిసారి

సిరీస్‌ గెలవడం మాత్రం ఇదే తొలిసారి

1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ టెస్టు సిరీస్‌ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ టెస్టు సిరిస్‌ను డ్రా చేసుకోగలిగింది కానీ, విజయం మాత్రం సాధించలేదు. అయితే, కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మాత్రం 2-1తో సిరిస్ నెగ్గి చరిత్ర సృష్టించింది.

ఇక మిగిలింది దక్షిణాఫ్రికాపైనే!

ఇక మిగిలింది దక్షిణాఫ్రికాపైనే!

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ నెగ్గాలన్న కలను నెరవేర్చుకున్న టీమిండియా ఇక దక్షిణాఫ్రికాలో టెస్టు సిరిస్ నెగ్లాల్సి ఉంది. 1992 నుంచి ఈ గడ్డపై పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటివరకు టెస్టుసిరిస్ నెగ్గలేదు. గతేడాది జనవరిలో ముగిసిన పర్యటనలో టెస్టు సిరీస్‌ విజయం సాధించేందుకు దగ్గరగా వచ్చినప్పటికీ టీమిండియా బ్యాట్స్‌మన్ విఫలం కాడవంతో ఆ అవకాశాన్ని పొగొట్టుకుంది.

Story first published: Wednesday, January 9, 2019, 10:27 [IST]
Other articles published on Jan 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+