2వ వారం తర్వాతే: ఐపీఎల్ మ్యాచ్‌లకు కోహ్లీ దూరం
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పాల్గొంటాడా? లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ ఏప్రిల్ రెండో వారం నుంచి ఐపీఎల్‌కి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఈ మేరకు బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన ఫిట్‌నెస్ వివరాలను ప్రకటించింది. ఇందులో భాగంగా భుజం నొప్పి గాయంతో బాధపడుతున్న విరాట్ కోహ్లీకి కొన్ని రోజులు విశ్రాంతి కల్పించినట్లు పేర్కొంది. దీంతో ఐపీఎల్ మొదటి వారంలో జరిగే మ్యాచ్‌లకు కోహ్లీ దూరమవుతునట్లు పేర్కొంది.
దీంతో బెంగుళూరు జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లైయింది. కోహ్లీ రాక కోసం ఆశగా ఎదురుచూసిన బెంగళూరు ఆటగాళ్లకు సైతం నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే గాయల కారణంగా టీమిండియాకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

అశ్విన్‌కు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి
హెర్నియాతో బాధపడుతోన్న టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. ఇక ఎడమ చేతి భుజానికి శస్త్ర చికిత్స కోసం ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా ఐపీఎల్‌లో పాల్గొనడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

మురళీ విజయ్‌కి ఆపరేషన్ అవసరం
మణికట్టు గాయం కారణంగా బాధపడుతోన్న మరో ఓపెనర్ మురళీ విజయ్‌కి ఆపరేషన్ అవసరమని బీసీసీఐ పేర్కొంది. దీంతో పాటు ఎడమ చేతి భుజం నొప్పి కూడా విజయ్‌ని వేధిస్తోండటంతో ఐపీఎల్ నుంచి పూర్తి విరామం తీసుకుని, ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తి ఫిట్‌నెస్ సాధించేలా సిద్ధం కావాలని సూచించింది.

రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్‌లకు రెండు వారాల పాటు విశ్రాంతి
ఇక ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్ ఆడిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ ఉమేశ్ యాదవ్‌కు బీసీసీఐ మెడికల్ టీమ్ రెండు వారాల పాటు విశ్రాంతి కల్పించింది. దీంతో ఈ ఇద్దరూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారని బీసీసీఐ మెడికల్ టీమ్ ప్రకటించింది.

ఐపీఎల్ 10వ సీజన్‌లో రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్
ఈ ఇద్దరూ ఐపీఎల్ 10వ సీజన్‌లో పాల్గొంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ ఏడాది హోం సీజన్‌లో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన చేశారు. ఆల్ రౌండర్ జడేజా 717.2 ఓవర్లు వేసి 71 వికెట్లు తీశాడు. అదే విధంగా ఉమేశ్ యాదవ్ 12 మ్యాచ్‌ల్లో 355.5 ఓవర్లు వేసి 30 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications