Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా మైనపు విగ్రహం ఆవిష్కరణకు రండి: ఫ్యాన్స్‌ను కోరిన కోహ్లీ

Virat Kohli all set to unveil his Wax statue at iconic museum
Virat Kohli’s Inviting Everyone To Play Statue; Here’s What It’s About

హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అభిమానులంటే కోహ్లీకి ఎంతో ప్రేమ. తన అభిమానుల కోసం అప్పుడప్పుడు మంచి సలహాలు, సూచనలు కూడా చేస్తుంటాడు. తాజాగా ఓ కార్యక్రమానికి రావాల్సిందిగా తన అభిమానులను కోహ్లీ ఆహ్వానించాడు.

విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రదర్శన కోసం బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోహ్లీ మంగళవారం తన ట్విట్టర్‌లో ఒక వీడియో ద్వారా అభిమానులను కోరాడు.

జూన్ 6న ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌కు రండి

'జూన్ 6న ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌కు అందరూ రండి. అక్కడ ఏర్పాటు చేసిన నా స్టాచ్యూతో ఆడుకోండి. నాతో సెల్ఫీలు తీసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే, ఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌‌ మ్యూజియంలో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టండి. జూన్ 6 నుంచి నేను మీకు అక్కడ అందుబాటులో ఉంటాను. నా మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో ప్రదర్శన కోసం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశాడు.

టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు

టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు

తన అద్భుతమైన ఆటతీరుతో విరాట్ కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆటగాడిగా మాత్రమే కాకుండా కెప్టెన్‌గా కూడా భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా విరాట్ కోహ్లీ ఒకడిగా పేరొందాడు.

 సచిన్, కపిల్ తర్వాత ఈ ఘనత సాధించిన క్రీడాకారుడు

సచిన్, కపిల్ తర్వాత ఈ ఘనత సాధించిన క్రీడాకారుడు

దీంతో, కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. తద్వారా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఫుల్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీల తర్వాత ఈ ఘనత అందుకోబోతున్న క్రీడాకారుడు విరాట్ కోహ్లీనే కావడం విశేషం.

 మార్చి నెలలో అవసరమైన కొలతలు ఇచ్చిన కోహ్లీ

మార్చి నెలలో అవసరమైన కొలతలు ఇచ్చిన కోహ్లీ

గత మార్చి నెలలో లండన్‌ నుంచి వచ్చిన టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధుల బృందం విగ్రహం తయారీకి అవసరమైన 200 కొలతలను తీసుకున్నారు. 2008లో కోహ్లీ నేతృత్వంలోని అండర్-19 జట్టు వరల్డ్ కప్‌ను సాధించడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఐసీసీ వరల్డ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, మూడు సార్లు బీసీసీఐ ఇంటర్‌నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు.

Story first published: Tuesday, June 5, 2018, 17:23 [IST]
Other articles published on Jun 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+