For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

25వ సెంచరీ, తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు కొట్టేసిన కోహ్లీ

Virat Kohlis innovative celebration after smashing 25th Test ton

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్‌లో విఫలమైన ఈ పరుగుల యంత్రం రెండో టెస్ట్‌లో క్లిష్ట పరిస్థితుల్లో రాణించి జట్టుకు అండగా నిలిచాడు. 172/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. ఆదిలోనే అజింక్యా రహానేను ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హనుమ విహారితో కోహ్లి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

నేను కాదు.. నా బ్యాట్ మాట్లాడుతుంది

ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 82‌తో ఆదివారం ఆటని కొనసాగించిన విరాట్ కోహ్లీ.. 214 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది 25వ సెంచరీ కాగా.. ఆస్ట్రేలియాపై 7వ సెంచరీ. శతక అభివాదంలో ‘నేను కాదు.. నా బ్యాట్ మాట్లాడుతుంది' అని అర్థం వచ్చేలా విరాట్ కోహ్లీ సంజ్ఞలు చేయడం విశేషం.

ఆఫ్ స్టంప్‌కి వెలుపల బంతులు విడిచిపెడుతూ

ఆఫ్ స్టంప్‌కి వెలుపల ఊరిస్తూ బంతులు విసిరినా.. సహనంతో వాటిని విడిచిపెడుతూ.. ఇన్నింగ్స్‌ని నిర్మించాడు. ఈ క్రమంలో.. పుజారాతో కలిసి మూడో వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. ఆ తర్వాత రహానెతో నాలుగో వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.

మిడాఫ్ దిశగా బంతిని బౌండరీకి తరలించి

శనివారం పాట్ కమిన్స్ బౌలింగ్‌లో కట్‌షాట్ కొట్టి.. 109 బంతుల్లో 50 పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లి.. ఆదివారం మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా బంతిని బౌండరీకి తరలించి సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. తద్వారా టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 25 సెంచరీలు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు.

కోహ్లీని దాటే అవకాశం స్మిత్ ఒక్కడికే

కోహ్లీని దాటే అవకాశం స్మిత్ ఒక్కడికే

76 మ్యాచ్‌లు.. 128 ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించగా.. దిగ్గజ క్రికెటర్‌ బ్రాడ్‌మన్‌ 52 మ్యాచ్‌లు.. 68 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 130 ఇన్నింగ్స్‌ల్లో.. మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకొని కోహ్లి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక కోహ్లి రికార్డును అధిగమించడానికి ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌కే అవకాశం ఉంది. 117 ఇన్నింగ్స్‌ల్లోనే 23 సెంచరీలు పూర్తి చేసిన స్మిత్‌.. బాల్‌ట్యాంపరింగ్‌ వివాదంతో ఆటకు దూరమైన విషయం తెలిసిందే.

1
43624
Story first published: Sunday, December 16, 2018, 11:37 [IST]
Other articles published on Dec 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+