For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దక్షిణాఫ్రికాలో కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది'

By Nageshwara Rao
Virat Kohli’s Indian cricket team can make history in South Africa: Lalchand Rajput

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చరిత్ర సృష్టిస్తుందని టీమిండియా మాజీ జట్టు మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో కోహ్లీసేన పదో సిరిస్ గెలిచి టెస్టు చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలను గెలిచిన జట్టుగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలే శ్రీలంకపై టెస్టు సిరిస్ నెగ్గడంతో వరుసగా అత్యధిక టెస్టు సిరిస్ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డుని కోహ్లీ సమం చేసిన సంగతి తెలిసిందే.

2005 నుంచి 2008 మధ్య కాలంలో పాంటింగ్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా తొమ్మిది సిరీస్‌లను గెలిచింది. ఇంగ్లండ్‌ జట్టు కూడా 1884 నుంచి 1892 మధ్యకాలంలో తొమ్మిది టెస్టు సిరీస్‌లలో విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికాతో వచ్చే ఏడాది జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలిటెస్టు జనవరి 5 నుంచి ప్రారంభం కానుంది.

'ప్రస్తుతం భారత జట్టు ఉన్న పరిస్థితులను చూస్తుంటే స్వదేశంలో కాదు విదేశంలో కూడా విజయాలు సాధిస్తుంది. దూకుడు స్వభావం కలిగిన కోహ్లీ ఓటమిని అస్సలు అంగీకరించడు. ప్రస్తుతం భారత జట్టు క్రూరమైన జట్టుగా ఉంది' అని అన్నాడు.

భారత విజయాల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కీలక ఆటగాళ్లుగా ఉన్నారని కొనియాడాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ బౌలింగ్‌ని భారత జట్టు కలిగి ఉందని చెప్పాడు. 'దక్షిణాఫ్రికాలో ఆ జట్టుని ఓడించడానికి భారత్‌కు ఇదే మంచి అవకాశం. చరిత్ర సృష్టించే అవకాశం ఈ జట్టుకు ఉంది' అని అన్నాడు.

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మపై లాల్‌చంద్ రాజ్‌పుత్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేటప్పుడు చూసేందుకు చూడముచ్చటగా ఉంటుందని అన్నాడు. గాయాల కారణంగా రోహిత్ శర్మ ఎక్కువ టెస్టు క్రికెట్ ఆడలేకపోయాడని తెలిపాడు.

అయితే ఇటీవలే శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరిస్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడని, రాబోయే రోజుల్లో మంచి ప్రదర్శన చేస్తాడని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆప్ఘనిస్థాన్ మాజీ కోచ్‌గా సేవలందించిన రాజ్‌పుత్ ఆ జట్టుతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ ఆడుతుందని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 15:03 [IST]
Other articles published on Dec 15, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+