Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్కతో పెళ్లి ఎఫెక్ట్: నెంబర్ వన్ ర్యాంకుని కోల్పోయిన కోహ్లీ

హైదరాబాద్: ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో వివాహం సందర్భంగా శ్రీలంకతో టీ20 సిరిస్‌ నుంచి కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇది కోహ్లీ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది.

 ఒక్కో టీ20 మ్యాచ్‌కి రెండు శాతం చొప్పున కోత

ఒక్కో టీ20 మ్యాచ్‌కి రెండు శాతం చొప్పున కోత

నిబంధనల ప్రకారం దూరమైన ఒక్కో టీ20 మ్యాచ్‌కి రెండు శాతం చొప్పున ఆటగాడి పాయింట్లలో కోత విధిస్తారు. దీంతో విరాట్ 824 పాయింట్ల నుంచి 776 పాయింట్లకు పడిపోయి ప్రస్తుతం మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆరోన్‌ ఫించ్‌ (784 పాయింట్లు), వెస్టిండీస్‌ క్రికెటర్‌ ఇవిన్‌ లూయిస్‌ (780) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

 వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ, టెస్టుల్లో రెండో స్ధానం

వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ, టెస్టుల్లో రెండో స్ధానం

టాప్‌-3లో ఉన్న ముగ్గురికీ నాలుగు పాయింట్ల చొప్పున అంతరం ఉంది. వన్డేల్లో తొలిస్థానంలో ఉన్న కోహ్లీ, టెస్టుల్లో స్మిత్ తర్వాతి స్థానంలో అంటే రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్‌లో 154 పరుగులు చేసిన ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ 23 స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు దక్కించుకున్నాడు.

 35 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ

35 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ

ఇక, ఇండోర్‌ టీ20లో 35 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ ఆరు స్థానాలు ఎగబాకి 14 ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సిరీస్‌లో ఎనిమిది వికెట్లతో చెలరేగిన స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ 14 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకు అందుకున్నాడు. హార్దిక్‌ పాండ్య 39, కుల్‌దీప్‌ యాదవ్‌ 64 ర్యాంకుల్లో ఉన్నారు.

 మూడో స్థానానికి పడిపోయిన బుమ్రా

మూడో స్థానానికి పడిపోయిన బుమ్రా

టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అయిన బుమ్రా కూడా అగ్రస్థానాన్ని కోల్పోయాడు. లంకతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేక పోయిన బుమ్రా.. మూడో టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అతడు మూడో స్థానానికి పడిపోయాడు. పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్ వసీం అగ్రస్థానానికి చేరుకోగా, రషీద్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు.

 ఆరు టీ20 సిరీస్‌లాడిన భారత్ నాలుగింట విజయం

ఆరు టీ20 సిరీస్‌లాడిన భారత్ నాలుగింట విజయం

శ్రీలంకపై 3-0తో టీ20 సిరీస్ నెగ్గిన భారత జట్టు 121 పాయింట్లతో ఐదు నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకింది. ఈ ఏడాది తాను ఆడిన అన్ని టీ20 సిరీస్‌లను నెగ్గిన పాకిస్థాన్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 2017లో 6 టీ20 సిరీస్‌లాడిన భారత్ నాలుగు సిరీస్‌ల్లో విజయం సాధించగా... ఏడాది ఆరంభంలో విండీస్‌తో జరిగిన ఒకే ఒక టీ20 మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఆసీస్‌తో సొంత గడ్డ మీద జరిగిన సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Story first published: Tuesday, December 26, 2017, 10:56 [IST]
Other articles published on Dec 26, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+