Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లి ఇలా ఔటయ్యాడా? : 2002లో వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు విరాట్..

రాజ్ కోట్ : ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు భారత బ్యాట్స్ మెన్ త్వరత్వరగా వికెట్లు సమర్పించేసుకున్నారు. ముఖ్యంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అవుట్ అయిన తీరు ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ స్వాన్ బౌలింగ్ లో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు కోహ్లి.

బంతిని ఆడే క్రమంలో కుడి కాలుతో స్టంప్ ను గిరాటేయడంతో.. కోహ్లి హిట్ వికెట్ గా అవుటయ్యాడు. దీంతో హిట్ వికెట్ గా అవుట్ అయిన 23వ భారత బ్యాట్స్ మెన్ గా గుర్తింపు పొందాడు కోహ్లి. చివరిసారిగా 2002లో వీవీఎస్ లక్ష్మణ్ ఇదే తరహాలో అవుటయ్యాడు.

ఇకపోతే శనివారం నాడు ఓవర్ నైట్ స్కోరు 319/4 పరుగులతో నాలుగో రోజు క్రీజులోకి వచ్చిన కోహ్లి, రహానే ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరుకు మరో 13 పరుగులు మాత్రమే జోడించిన రహానే, అన్సారీ బౌలింగ్‌లో 5వ వికెట్‌ గా అవుటయ్యాడు.

Virat Kohli’s hit wicket dismissal in Rajkot Test a rare occasion

అనంతరం క్రీజులోకి వచ్చిన కీపర్ సాహా కూడా 35(82) పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో అశ్విన్ (37), జడేజా కొనసాగుతున్నారు.

ఇరు జట్ల స్కోరు వివరాలు సంక్షిప్తంగా :

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ : 537 ఆలౌట్
భారత్ మొదటి ఇన్నింగ్స్ : విజయ్ 126, గంభీర్ 29, పుజారా 124, కోహ్లీ 40, మిశ్రా 0, రహానే 13, అశ్విన్ 38 నాటౌట్, జడేజా (1), 145ఓవర్లలో మొత్తం: 428/7

వికెట్ల పతనం: 68-1, 277-2, 318-3, 319-4, 349-5, 361-6,425-7

బౌలింగ్: బ్రాడ్ 1, అన్సారీ 2, రషీద్ 2, స్టోక్స్ 1 వికెట్, మొయిన్ అలీ 1వికెట్

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+