బాబోయ్ కోహ్లీ: గ్రౌండ్‌లో రికార్డులు, జిమ్‌లో కసరత్తులు
ఆంటిగ్వా: ఫిట్‌నెస్ పరంగా కోహ్లీ ఎంత ఫిట్‌గా ఉన్నాడో ఈ ఫోటోను చూస్తేనే తెలుస్తోంది. యూత్ ఐకాన్‌గా నిలిచిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో కఠినమైన కసరత్తులు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. తొలి టెస్టులో వెస్టిండిస్‌పై విజయం సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లీ అక్కడ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
'ఫిట్‌నెస్ కోసం కష్టపడండి.. ఎందుకంటే విజయానికి కష్టపడటం తప్ప షార్ట్ కట్స్ ఉండవు' అంటూ అందులో ఆ వీడియోలో కోహ్లి పేర్కొన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం వెస్టిండిస్‌కు వెళ్లిన టీమిండియా తొలి టెస్టులో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఈ ఏడాది అన్ని ఫార్మెట్లలో మొత్తం 1980 పరుగులు చేశాడు.
అంటిగ్వా వేదికగా జరిగిన జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో వెస్టిండిస్‌పై భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న భారత క్రికెట్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లోనే 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
ఈ భారీ ఇన్నింగ్స్‌లో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి డబుల్ సెంచరీతో సాధించగా, స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండిస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మరింత పేలవంగా ఆడి 231 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది.
జులై 30 నుంచి జరగనున్న రెండో టెస్టుకు కోహ్లీ సేన సిద్ధమైంది. తొలి టెస్టు విజయంతో ఉత్సాహాంగా ఉన్న టీమిండియా రెండో టెస్టులో ఇదే కొనసాగించాలనే భావనతో ఉంది. తొలి టెస్టు మ్యాచ్ అనంతరం లభించిన విరామ సమయంలో టీమిండియా ఆటగాళ్లు పుట్‌బాల్, ప్లే స్టేషన్ లాంటి ఆటల్లో నిమగ్నమయ్యారు.
బాబోయ్ కోహ్లీ: గ్రౌండ్‌లో రికార్డులు, జిమ్‌లో కసరత్తులు
తొలి టెస్టులో వెస్టిండిస్‌పై విజయం సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లీ అక్కడ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

బాబోయ్ కోహ్లీ: గ్రౌండ్‌లో రికార్డులు, జిమ్‌లో కసరత్తులు
టీమ్ బస్సులో ఫోటోకు ఫోజులిస్తున్న టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, స్టువర్ట్ బిన్నీ, కేఎల్ రాహుల్.

బాబోయ్ కోహ్లీ: గ్రౌండ్‌లో రికార్డులు, జిమ్‌లో కసరత్తులు
టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో పాటు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, మిగతా సపోర్టింగ్ స్టాఫ్.

బాబోయ్ కోహ్లీ: గ్రౌండ్‌లో రికార్డులు, జిమ్‌లో కసరత్తులు
కింగ్‌స్టన్‌లోని హోటల్‌లో ఫోటోలకు ఫోజులిస్తున్న టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్

బాబోయ్ కోహ్లీ: గ్రౌండ్‌లో రికార్డులు, జిమ్‌లో కసరత్తులు
కింగ్‌స్టన్‌లోని హోటల్‌లో టీమిండియా ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications