55 రివ్యూల్లో 17: డీఆర్‌ఎస్ విషయంలో కోహ్లీ తప్పటడుగు
హైదరాబాద్: ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న కోహ్లీ కెప్టెన్‌గా ఇప్పటికే అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. అయితే నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్) విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడనే విషయాన్ని గణాంకాలే తెలియజేస్తున్నాయి.
దాదాపు ఎనిమిదేళ్ల పాటు అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన సిరిస్‌లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు బీసీసీఐ అంగీకరించింది. అయితే ఆ సిరీస్ నుంచి డీఆర్‌ఎస్‌ను ఉపయోగించిన ఏడు టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ మొత్తం 55 రివ్యూలు కోరగా 17 మాత్రమే అనుకూలంగా వచ్చాయి.
ఫీల్డింగ్‌లో కోహ్లీసేన 42 సమీక్షలు కోరితే కేవలం పదింటిలో మాత్రమే అనుకూలంగా నిర్ణయం వచ్చింది. ఇక, బ్యాటింగ్‌లో 13 రివ్యూల్లో ఏడింటిలో మాత్రమే సక్సెస్ అయ్యాయి. దీంతో బ్యాటింగ్, ఫీల్డింగ్ సమీక్షల్లో టీమిండియా విజయ శాతం 30.9తో నిరాశ కలిగించే విధంగా ఉంది.

తొలి టెస్టులో కోహ్లీ అంచనాలు పూర్తిగా తప్పాయి
ముఖ్యంగా ఇంగ్లాండ్ సిరిస్‌లో డీఆర్‌ఎస్ సమస్యలు బయటపడినా, ఆస్ట్రేలియాతో పూణెలో జరిగిన తొలి టెస్టులో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా కనిపించింది. డీఆర్ఎస్‌ను ఉపయోగించుకోవడంలో కోహ్లీ పూర్తిగా అంచనాలు తప్పుతున్నాడు. ఫీల్డింగ్ కెప్టెన్‌గా కోహ్లీ ఇప్పటి వరకు 39 సార్లు రివ్యూ కోరగా 30 సార్లు ఫలితం భారత్‌కు ప్రతికూలంగా వచ్చింది.

భారత్ డీఆర్‌ఎస్ వాడటంలో మెరుగు పడాలన్న వార్న్
డీఆర్ఎస్ విధానంపై పలువురు మాజీలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఏమో మన అదృష్టం పరీక్షించుకుందాం అని ప్రయత్నం చేయడం జట్టు ప్రయోజనాలను పణంగా పెట్టడమే. భారత్ డీఆర్‌ఎస్ వాడటంలో చాలా మెరుగుపడాలి' అని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు.

రాహుల్ రివ్యూ కోరడంపై రవిశాస్త్రి విమర్శ
‘రివ్యూల విషయంలో భారత్ నన్ను షాక్‌కు గురి చేసింది. చివరి ఇన్నింగ్స్‌లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు రాహుల్ దానికి ఎలా రివ్యూ కోరాడు' అని రవిశాస్త్రి విమర్శించారు. పూణె టెస్టు అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ‘భారత జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్ అంత తొందరగా రివ్యూ వాడుకోవడం మా అదృష్టం. ఇలాంటి వికెట్‌పై కచ్చితంగా రివ్యూ అవసరం పడుతుంది. కనీసం ఒకదానిని భద్రంగా దాచుకుంటేనే మంచిది' అని స్మిత్ అన్నాడు.

అంపైర్ పొరపాట్లను తగ్గించి సరైన నిర్ణయం కోసమే డీఆర్‌ఎస్
ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సైతం తొలి టెస్టులో మురళీ విజయ్, రాహుల్ నిర్ణయం పట్ల కోహ్లీ కచ్చితంగా తీవ్ర కోపానికి గురయ్యే ఉంటాడని అభిప్రాయపడ్డారు. నిజానికి సాధ్యమైనంతగా అంపైర్ పొరపాట్లను తగ్గించి సరైన నిర్ణయం వెలువరించడమే డీఆర్‌ఎస్ ప్రధాన ఉద్దేశం. కానీ ఆటగాళ్లకు రివ్యూ కోరే అవకాశం ఇవ్వడంతో అంతా గందరగోళంగా మారుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications