Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ రెచ్చగొట్టాడు: 'స్మిత్ రివ్యూ సైగలపై షాక్‌కు గురయ్యా'

హైదరాబాద్: బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ ప్రణాళిక ప్రకారమే డ్రెస్సింగ్‌ రూమ్ నుంచి సలహాలు పొందుతున్నాడన్న టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఆరోపణలను ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్‌ డేవిడ్‌ సాకేర్‌ కొట్టిపారేశాడు. మైదానంలోనుంచి స్మిత్‌ చేసిన సైగలతో స్వయంగా తాము కూడా షాక్‌కు గురయ్యేలా చేసిందని తెలిపాడు.

డీఆర్ఎస్ రివ్యూ కోసం ప్రతిసారీ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ, అక్కడి నుంచి సూచనల కోసం స్టీవ్ స్మిత్ ఎదురుచూస్తున్నాడని మ్యాచ్ విజయానంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించిన సాకేర్ కోహ్లీ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పాడు.

Virat Kohli's claim on Steve Smith absurd and offensive: Australia assistant coach

'ఆస్ట్రేలియా జట్టు ఓ ప్రణాళిక ప్రకారం డీఆర్ఎస్ రివ్యూ సలహాలు పొందుతోందన్న ఆరోపణలు అసంబద్ధమైనవి. సలహాలు ఇచ్చేందుకు మేం ప్రత్యేక ప్రణాళిక రచించలేదు. నిజానికి స్మిత్‌ బాల్కనీవైపు చూసినప్పుడు మేమందరం షాక్‌కు గురయ్యాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. అందుకే చాలా ఆశ్చర్యం కూడా కలిగింది' అని సాకేర్ అన్నాడు.

'కోహ్లీ ఆరోపించినట్లు డీఆర్ఎస్ రివ్యూ కోసం ప్రత్యేక సైగలు రూపొందించుకుని ఉంటే డేవిడ్‌ వార్నర్‌, షాన్‌ మార్ష్‌ల విషయంలో తప్పు చేసేవాళ్లం కాదు కదా. అంతకు ముందు కూడా మేం ఇలా చేశామనే ఆరోపణను మాత్రం ఖండిస్తున్నా. మమ్మల్ని మోసగాళ్లు అని కోహ్లీ రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు. ఈ వివాదంలో ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచింది' అని అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+