For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంత నమ్మకం లేనప్పుడు ఎందుకు అతన్ని జట్టులోకి తీసుకున్నట్లు..? రోహిత్‌కు కోహ్లీ చిన్ననాటి కోచ్ సూటి ప్రశ్న

Virat Kohli’s childhood coach Rajkumar Sharma Pointed out the Decision of Rohit about Deepak hooda

ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో దీపక్ హుడాకు ఒకట్రెండు ఓవర్లు ఇవ్వవలసిందని విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అభిప్రాయపడ్డాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్‌‌గా దీపక్ హుడాతో బౌలింగ్ చేయించాల్సి ఉండాల్సిందని సూచించాడు. మహ్మద్ నవాజ్ నెం 4గా బ్యాటింగ్‌కు దిగినందున.. టీ20 క్రికెట్‌లో బౌలింగ్ చేసిన అనుభవం ఉన్న హుడా నవాజ్‌ను ఇబ్బంది పెట్టేలా బౌలింగ్ చేసేవాడని శర్మ అభిప్రాయపడ్డాడు. హుడా బౌలింగ్ సామర్థ్యాలపై కెప్టెన్‌ రోహిత్ శర్మకు తగినంత నమ్మకం లేదని, ఆరో బౌలింగ్ ఎంపికగా అతన్ని అసలే పరిగణించలేదని రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నాడు.

అతని రెండు ఓవర్లు ఇవ్వాల్సింది

అతని రెండు ఓవర్లు ఇవ్వాల్సింది

సోమవారం ఇండియా న్యూస్ స్పోర్ట్స్‌లో జరిగిన చర్చలో శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'దీపక్ హుడా ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా కూడా ఉపయోగపడతాడనే ఉద్దేశంలో అతన్ని జట్టులో చేర్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మహ్మద్ నవాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతనికి రెండు ఓవర్లు ఇవ్వాల్సి ఉండాల్సింది. రోహిత్ శర్మకు బౌలర్‌గా అతనిపై అసలే నమ్మకం కుదర లేదు. హుడాను లెఫ్టార్మ్ బ్యాటర్‌కు ప్రయోగిస్తే ఎంతో కొంత ఫలితం వచ్చేదని, ఆ విషయాన్ని రోహిత్ అసలు అనుకోలేదనడానికి అతన్ని బౌలింగ్లో వాడుకోకపోవడమే తెలియజేస్తుంది. అతను టీ20క్రికెట్‌లో చాలా ఎక్కువ సార్లు బౌలింగ్ చేసిన అనుభవం ఉన్న ప్లేయర్. అందువల్ల బౌలింగ్ చేసి ఉంటే.. తప్పకుండా హార్దిక్ పాండ్యా బౌలింగ్ పడకపోవడంతో కొంత ఉపయుక్తంగా ఉండేది. నవాజ్‌ ఇన్నింగ్స్‌ పాకిస్థాన్‌కు చాలా ఉపయోగపడింది. అతను 20బంతుల్లో 42పరుగులతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. బౌలింగ్లోనూ కీలక 2వికెట్లు తీసి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.' అని హుడా చెప్పాడు.

టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన పెద్ద తప్పు ఇదే

టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన పెద్ద తప్పు ఇదే

జ్వరం కారణంగా అవేష్ ఖాన్ మ్యాచ్‌కు దూరమైన తర్వాత భారత్‌కు పేస్ బౌలింగ్‌ను ఎంచుకోవడానికి సరైన ఎంపిక లేదని రాజ్ కుమార్ శర్మ తెలిపాడు. జట్టులో కేవలం ముగ్గురు సీమర్లు మాత్రమే ఉండాలన్న టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని అతను ప్రశ్నించాడు. జట్టులో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నప్పటికీ అతన్ని ఆడించే ప్రయత్నం చేస్తారని తాను భావించట్లేదని, జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లను ఉండాలన్న భారత నిర్ణయాన్ని కూడా అతను తప్పుపట్టాడు. మరో సీమర్‌ను తీసుకోకుండా జట్టు పెద్ద తప్పు చేసిందని పేర్కొన్నాడు.

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా మ్యాచ్

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా మ్యాచ్

ఆసియాకప్ 2022లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 60) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్(28) శుభారంభాన్నిచ్చారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 182పరుగులు చేసి విజయాన్నందుకుంది. మహమ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ నవాజ్(20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), అసిఫ్ అలీ(16) కీలక పరుగులు చేశారు.

Story first published: Tuesday, September 6, 2022, 10:08 [IST]
Other articles published on Sep 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+