న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సముచిత స్థానం: ఢిల్లీ బౌలింగ్ కోచ్‌గా విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్

KP Bhaskar Appointed Delhi's Head Coach, Rajkumar Bowling Coach
 Virat Kohlis childhood coach appointed Delhis bowling coach

హైదరాబాద్: ఢిల్లీ బౌలింగ్ కోచ్‌గా విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మను ఢిల్లీ & డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా కేపీ భాస్కర్‌ను ఎంపిక చేయగా... బౌలింగ్ కోచ్‌గా రాజ్ కుమార్ శర్మ ఎంపికయ్యాడు.

తమిళనాడు సాంప్రదాయ దుస్తుల్లో రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్తమిళనాడు సాంప్రదాయ దుస్తుల్లో రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్

ఈ మేరకు డీడీసీఏ ట్విట్టర్‌లో తెలిపింది. "సీనియర్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా కేపీ భాస్కర్, బౌలింగ్ కోచ్‌గా రాజ్ కుమార్ శర్మను ఎంపిక చేసినట్లు ప్రకటించేందుకు సంతోషిస్తున్నాం. ఈ సీజన్ వారికి కలిసిరావాలని కోరుకుంటున్నాం" అంటూ ట్వీట్ చేసింది.

95 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన భాస్కర్ గతేడాది ఉత్తరాఖండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేశారు. కుడిచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన భాస్కర్ 1983 నుంచి 1989 మధ్య రంజీ ట్రోఫీలో 70కి పైగా యావరేజితో చక్కటి ప్రదర్శన చేశాడు. అయితే, టీమిండియా తరుపున ఒక్కసారి కూడా ఆడే అవకాశం లభించలేదు.

కాగా, 1985లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు స్టాండ్ బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. నాగ్‌పూర్ వేదికగా బాంబే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఆఫ్ ఇండియా తరుపున ఆడాడు. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాస్కర్ సెంచరీ సాధించాడు.

రెండో స్థానంపై కన్నేసిన బెంగాల్... గెలుపు రుచి కోసం తమిళ తలైవాస్రెండో స్థానంపై కన్నేసిన బెంగాల్... గెలుపు రుచి కోసం తమిళ తలైవాస్

ఢిల్లీ బౌలింగ్ కోచ్‌గా నియమింపబడిన రాజ్ కుమార్ ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చిన్ననాటి కోచ్ అన్న సంగతి తెలిసిందే. మాజీ రంజీ క్రికెటర్ ఆయిన రాజ్ కుమార్ తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. ఢిల్లీ తరుపున మొత్తం 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసినందుకు గాను 2016లో రాజ్ కుమార్‌కు ద్రోణాచార్య అవార్డు అందుకున్నాడు.

Story first published: Thursday, August 29, 2019, 17:46 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X