
మాంచెస్టర్: ప‌్రపంచకప్ టోర్నమెంట్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆరంభంలోనే భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్ పాయింట్‌లో నిల్చున్న కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌పై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్వీట్ల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. విరాట్ కోహ్లీ నుంచి ఇలా మెరుపులాంటి క్యాచ్‌ను ఇప్పటిదాకా చూడలేదని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఆరంభంలోనే గప్టిల్ వికెట్‌ను కోల్పోవడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ రిథమ్ కోల్పోయింది. మందకొడిగా బ్యాటింగ్ చేస్తోంది. 30 ఓవర్లు ముగిసినప్పటికీ.. ఆ జట్టు రన్‌రేట్ నాలుగుకు మించిపోలేదు. మరోవంక- టీమిండియా బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య కివీస్ బ్యాట్స్‌మెన్లకు కళ్లెం వేశారు.