అమాంతం పెరిగిన బ్రాండ్ వ్యాల్యూ: షారుఖ్ తర్వాత కోహ్లీనే
హైదరాబాద్: తన అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్‌లో ప్రపంచ రికార్డులను సృష్టిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదాయంలోనూ ఎవరికీ అందనంత ఎత్తుకు దూసుకుపోతున్నాడు. భారత్‌లో బ్రాండ్ విలువ పరంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మొదటి స్ధానంలో ఉండగా విరాట్ కోహ్లి రెండో స్ధానంలో ఉన్నాడు.
మహేంద్రసింగ్ ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కోహ్లీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. ప్రస్తుతం కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ (విలువ) 92 మిలియన్ యూఎస్ డాలర్లు. అంటే, భారత కరెన్సీలో అక్షరాలా 616 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ మధ్య కాలంలో అద్భుత ప్రదర్శన చేస్తున్న కోహ్లీ తన ఇమేజ్‌ని ఉపయోగించుకొని కార్పొరేట్ సంస్థలతో భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకున్నాడు.

రెండోస్థానంలో కెప్టెన్ కోహ్లీ
2016 సంవత్సరానికి గాను భారత్‌లోని ప్రముఖ సెలబ్రిటీల బ్రాండ్ వ్యాల్యూ వివరాలను వెల్లడించే ఓ గ్లోబల్ కార్పొరేట్ సంస్థ నివేదిక ప్రకారం సంపదను ఆర్జించడంలో విరాట్ కోహ్లీ రెండోస్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ 131 మిలియన్ యూఎస్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

కెప్టెన్సీ తర్వాత 20 నుంచి 25శాతానికి పెరిగిన వ్యాల్యూ
ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీ ఈ ఏడాది పరిమిత ఓవర్లకు కూడా సారథిగా ఎంపికవడంతో మార్కెట్‌లో అతని బ్రాండ్ విలువ అమాంతం 20 నుంచి 25శాతానికి పెరిగిందట. ఇలానే కొనసాగితే అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బ్రాండ్ విలువను కోహ్లి అధిగమించినా ఆశ్చర్యపోనసరం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

అడిడాస్ ఏడాదికి రూ. 10 కోట్లు
2014లో ధోని టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో 11 ఏళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ధోనితో తనకున్న అనుబంధాన్ని తెంచుకున్న పెప్సికో కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. అంతకముందు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న అడిడాస్ ఏడాదికి రూ. 10కోట్లు ఇచ్చేందుకు కోహ్లితో ఒప్పందం చేసుకుంది.

కెప్టెన్సీ చేపట్టిన తర్వాత పెరిగిన బ్రాండ్ వ్యాల్యూ
ఎప్పుడైతే కోహ్లీని బీసీసీఐ వన్డే, టీ20లకు కెప్టెన్‌గా నియమించిందో, అప్పుడు అతని వ్యాల్యూ మరింత ఎక్కువ పెరిగింది అని స్పోర్ట్స్ మార్కెటింగ్ బేస్‌లైన్ వెంచర్స్ సంస్థ ఎండీ తుహిన్ మిశ్రా తెలిపారు. ఆడీ, విక్స్, బూస్ట్, టిస్సాట్, హెర్బలైఫ్, కోల్గేట్, యూఎస్‌ఎల్, టీవీఎస్, స్మాష్ ఇలా 20కిపైగా బ్రాండ్లకు కోహ్లీ అంబాసిడర్‌గా ఉన్నాడు.

ఉత్తరాఖండ్ పర్యాటక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్
వీటితో పాటు పలు నగరాల్లో చిజెల్ పేరిట జిమ్‌లు ఏర్పాటు చేసి కోహ్లీ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా మిషన్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నాడు. మరోవైపు ఉత్తరాఖండ్ పర్యాటక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications