Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జీనియస్, విన్నర్, ఫైటర్.. కోహ్లీని పొగిడేస్తున్న పాక్ మహిళా క్రికెటర్లు

Virat Kohli's Batting Genius Leaves Pakistan Women Cricketers Awestruck

హైదరాబాద్: కోహ్లీ పరుగుల యంత్రం, చేజింగ్ వీరుడు, రాక్ స్టార్, ఫైటర్, విన్నర్, సెంచరీల యోధుడు, జీనియస్ ఇవన్నీ పాక్ మహిళా క్రికెటర్లు కోహ్లీకి ఇస్తున్న బిరుదులు. సెంచూరియన్ వేదికగా ఆరో వన్డేలో చెలరేగి ఆడిన కోహ్లీ 96బంతులకే 129పరుగులు చేశాడు. అంతే కాదు, ఈ స్కోరులో కేవలం బౌండరీలతోనే 80పరుగులు చేయడం విశేషం. రెండు సిక్సులు, 17ఫోర్లు బాదాడు.

దీంతో అతనికి సీనియర్ క్రికెటర్లు, భారత క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, విమర్శకులు సైతం అభినందనలు తెలిచజేస్తున్నారు. వాళ్ల విషయం పక్కన ఉంచితే దాయాది దేశం మహిళా క్రికెటర్లు సైతం తమ శుభాకాంక్షలు, పొగడ్తలను కలిపి ట్వీట్లు చేస్తున్నారు.

'బ్యాట్స్‌మెన్‌ అమితమైన గుర్తింపు. 35 సెంచరీలతో అమోఘమైన రికార్డు. నిజంగా అద్భుతమైన బ్యాటింగ్‌. కోహ్లి ఓ జీనియస్‌' అంటూ పాక్‌ బ్యాట్స్‌ ఉమెన్‌ నైని అబిది ట్వీట్‌ చేయగా.. వాట్‌ ఏ ప్లేయర్‌ అంటూ మరో క్రీడాకారిణి కైనత్‌ ఇంతియాజ్‌ ట్వీట్‌ చేసింది.

ఇక యువరాజ్‌, సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ, మురళీ విజయ్, మొహమ్మద్ కైఫ్, మిచెల్ వాన్, రైనా, అశ్విన్‌ రవిచంద్రన్‌, అఫ్గన్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌, ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌పీటర్సన్‌లు కూడా ట్విటర్‌లో ప్రశంసలు కురిపించారు.

Story first published: Saturday, February 17, 2018, 14:42 [IST]
Other articles published on Feb 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+