క్యాన్సర్‌కు ఇదే ఆయుధం: యువీకి కోహ్లీ, శర్మ సపోర్ట్
న్యూఢిల్లీ: క్యాన్సర్ మనిషికి అత్యంత ప్రమాదకర శత్రువు అని, అయితే దానికి చదువు(అవగాహన) అత్యంత శక్తిమంతమైన ఆయుధమని భారత క్రికెటర్ యువరాజ్‌సింగ్ అన్నాడు. అందరం కలిసి చిన్నారులకు ఈ శక్తిమంతమైన ఆయుధాన్ని ఇద్దామని యువరాజ్ ట్విట్టర్‌లో పిలుపినిచ్చాడు.
ఇప్పటి వరకు తాను క్రికెట్‌లో సాధించిన శతకాల కన్నా 100 మంది క్యాన్సర్ బాధిత చిన్నారులకు చదువు(అవగాహన) అందించడం తనకి ఎక్కువ గర్వకారణమన్నారు. అందరం కలిసి పిల్లల్ని చదివించడం సాధ్యమేనని యువీ చేసిన ట్వీట్ చేశాడు. గురువారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, యువీ ట్వీట్‌కు క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్‌కొహ్లీ, జహీర్ ఖాన్, మాజీ టెస్ట్ దిగ్గజం వివియస్ లక్ష్మణ్‌లు మద్దతు తెలుపుతూ 'టుగెదర్ యస్ వి కెన్' అంటూ ట్వీట్ చేశారు.
గతంలో క్యాన్సర్ బారిన పడిన యువరాజ్ సింగ్ ఆత్మస్థైర్యంతో చికిత్స పొంది సంపూర్ణంగా కోలుకుని తిరిగి తన కెరీర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications