Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

53 పరుగుల వెనుకంజ: కోహ్లీ, రోహిత్ శర్మలలో ఎవరిది పైచేయి?

Virat Kohli, Rohit Sharma to resume battle for T20I domination

హైదరాబాద్: హోమ్‌ సీజన్‌ను ఘనంగా ఆరంభిద్దామనుకున్న టీమిండియాకు వరుణుడు షాకిచ్చాడు. మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది.

ఈ సిరిస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20 మొహాలీ వేదికగా బుధవారం జరగనుంది. దీంతో ఇరు జట్ల గెలుపే లక్ష్యంగా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాయి.

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

ఈ టీ20 సిరిస్ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలపైనే ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(88 ఇన్నింగ్స్‌ల్లో 2422 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, విరాట్ కోహ్లీ 65 ఇన్నింగ్స్‌ల్లో 2369 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

53 పరుగుల వెనుకంజలో కోహ్లీ

53 పరుగుల వెనుకంజలో కోహ్లీ

విరాట్ కోహ్లీ కేవలం 53 పరుగుల వెనుకంజలో ఉండటంతో ఈ సిరిస్‌లో రోహిత్ శర్మను అధిగమిస్తాడో లేదో చూడాలి మరి. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్టిల్(2283) పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవగా, పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్(2263) నాలుగో స్థానంలో నిలిచాడు.

నాలుగు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ

నాలుగు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ

టీ20ల్లో రోహిత్ శర్మ ఇప్పటికే నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే, విరాట్ కోహ్లీ ఖాతాలో 21 హాఫ్ సెంచరీలు ఉన్నప్పటికీ ఒక్క సెంచరీ కూడా లేదు. టెస్టులు, వన్డేల్లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో కూడా సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

2015లో సఫారీలదే టీ20 సిరిస్

2015లో సఫారీలదే టీ20 సిరిస్

2015లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో అటు వన్డే సిరిస్‌తో పాటు టీ20 సిరిస్‌ను సైతం సొంతం చేసుకుంది. మూడు టీ20ల సిరిస్‌ను 2-0తో నెగ్గింది. ఈ నేపథ్యంలో మరోసారి సఫారీ జట్టుకు ఆ అవకాశం ఇవ్వకూడదని కోహ్లీసేన భావిస్తోంది. అయితే, 2008 నుంచి ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 13 టీ20లు జరగ్గా టీమిండియా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Story first published: Wednesday, September 18, 2019, 16:04 [IST]
Other articles published on Sep 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+