
ముంబైకి నా మనసులో ప్రత్యక స్థానం
కోరె అండర్సన్ బుధవారం స్పోర్ట్‌స్టార్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. 'ఐపీఎల్ లీగ్‌లో పాలుపంచుకోవడం ద్వారా అనేక మంది అంతర్జాతీయ స్టార్లతో కలిసి ఆడే అవకాశం దక్కింది. ప్రతిసారీ భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఎందరో ఆటగాళ్ళు, కోచ్‌లతో ఉండడం ద్వారా మరింత నేర్చుకోవచ్చు. నేను ఎక్కువ సమయం గడిపినందున ముంబైకి నా మనసులో ప్రత్యక స్థానం ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి' అని అండర్సన్ తెలిపాడు.

కెప్టెన్సీలో పెద్ద తేడా కనిపించదు
'2008 అండర్-19 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడి సరిగ్గా పదేళ్ల తర్వాత 2018లో అతడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కొత్తగా అనిపించింది. కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో పెద్ద తేడా కనిపించదు. ఇద్దరి ఆలోచన విధానం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఇద్దరు గొప్ప నాయకులే. అయితే ఐపీఎల్లో కోహ్లీతో పోలిస్తే.. రోహిత్ కాస్త ముందుంటాడు. కోహ్లీ చాలా ఎమోషన్ చూపిస్తాడు. వారిద్దరూ ఉత్తమ బ్యాట్స్‌మన్‌లు, జట్టు బాధ్యతలు మోస్తారు. సహజసిద్ధ కెప్టెన్‌లు' అని అండర్సన్ పేర్కొన్నాడు.

రోహిత్ ఇష్టమైన ఆటగాడు
'నాకు ఇష్టమైన ఆటగాళ్ళలో శర్మ ఒకరు. అతను షాట్లు ఆడుతుంటే అలా చూడాలనిపిస్తుంది. రోహిత్ క్రికెట్‌ను ప్రపంచంలోనే సులభమైన ఆటలా చూస్తాడు .ప్రపంచంలోని చాలా మంది ఇలానే చూస్తారు. భారత జట్టులో రోహిత్, కోహ్లీ విజేతలు. వారు మంచి వ్యూహకర్తలు, ఆటను అర్థం చేసుకుంటారు, ఎలా గెలవాలో తెలుసు. అందుకే టీమిండియా చాలా విజయవంతమైంది.ఐపీఎల్ ఎంతో కలిసొస్తుంది. ఎవరైనా ఆటగాడు గాయపడితే ప్రత్యామ్నాయాలు టీమిండియాకు ఉన్నాయి' అని అండర్సన్ అన్నాడు.

బుమ్రా తాజాగా ఉంటాడు
'జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ తాజాగా ఉంటాడు. అతను అద్భుతమైన ప్రతిభను కలిగి ఉన్నాడు. ప్రతిభావంతులైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ వారిని సరైన దిశలో నడిపించే వ్యక్తి కావాలి. ముంబైకి షేన్ బాండ్ లాంటి మంచి బౌలింగ్ కోచ్ ఉన్నాడు. ప్రస్తుతం బుమ్రా ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లలో ఒకడు. ఈ క్రెడిట్ అంతా అతని ప్రతిభదే. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా నమ్మదగని రీతిలో పురోగతి సాధించాడు. భారతీయ అభిమానులు అతన్ని ప్రేమిస్తారు. భారత క్రికెట్లో అతను చాలా పెద్ద పాత్ర పోషిస్తాడు' అని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












