టాప్‌లోనే కోహ్లీ, రోహిత్‌.. మూడులో బుమ్రా! ఆ జాబితాలో జడేజా ఒక్కడే!

Virat Kohli, Rohit Sharma maintain Top 2 spots in ICC ODI rankings- Bumrah at third

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. కోహ్లీ (842 రేటింగ్‌ పాయింట్లు) నంబర్‌ బ్యాట్స్‌మన్‌గా నిలువగా.. రోహిత్ ‌(837 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు అర్థ సెంచరీలతో మెరిసిన కోహ్లీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. టాప్‌లో ఉన్న కోహ్లీకి, రెండులో ఉన్న రోహిత్‌కు 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు రోహిత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (837 పాయింట్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అజమ్‌కు రోహిత్‌కు కేవలం 5 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. కివీస్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ 818 పాయింట్లతో నాలుగు, ఆసీస్‌ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ 791 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఇక మహిళల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ (749) అగ్ర స్థానంలో ఉంది. స్మృతి మందాన (732) నాలుగులో, మిథాలీ రాజ్ (687) 9వ స్థానంలో ఉన్నారు.

బౌలింగ్‌ విషయానికి వస్తే.. కివీస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 722 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆప్ఘన్‌ క్రికెటర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ (708) రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (700) మూడో స్థానంలో నిలిచాడు. బంగ్లా బౌలర్‌ మెహదీ హసన్ (694)‌, ఇంగ్లండ్‌ పేసర్ క్రిస్‌ వోక్స్‌ (675) నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.

ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మొదటి ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 420 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. మహ్మద్‌ నబీ, వోక్స్‌, స్టోక్స్‌, ఇమాద్‌ వసీమ్‌లు వరుసగా 2,3,4,5 స్థానాల్లో ఉన్నారు. ఒక ర్యాంకు పడిపోయిన రవీంద్ర జడేజా (253) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి జడేజా ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు.

మెరుపు రనౌట్‌.. జాంటీ రోడ్స్‌ని గుర్తుచేసిన పాకిస్థాన్ వికెట్ కీపర్!! (వీడియో)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, January 27, 2021, 18:29 [IST]
Other articles published on Jan 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X