For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

200వ వన్డేలో భారత్ ఓటమి: కోహ్లీ సెంచరీ చేస్తే, నిరాశపరిచిన రోహిత్

Virat Kohli and Rohit sharma both played 200th odi India lost

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో పరమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దిగ్గజ క్రికెటర్లుగా కొనియాడబడుతున్నారు. అయితే, యాదృఛికమో లేక కాకతాళీయమో తెలియదు గానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ కెరీర్‌లో ఆడిన 200వ వన్డేలో టీమిండియా ఓడిపోయింది. అయితే, ఈ రెండు సార్లూ టీమిండియా న్యూజిలాండ్ చేతిలోనే ఓటమిపాలు కావడం విశేషం. అయితే తన 200వ వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే, రోహిత్ శర్మ మాత్రం 7 పరుగులు చేసి అభిమానులను నిరాశపరిచాడు.

200వ వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ

అక్టోబర్ 22, 2017న వాంఖడె స్టేడియంలో న్యూజిలాండ్‌-భారత జట్ల మధ్య జరిగిన వన్డే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 200వ వన్డే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డే కెరీర్లో కోహ్లీకి ఇది 31వ సెంచరీ. ఈ సెంచరీతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 30 సెంచరీల రికార్డుని కోహ్లీ అధిగమించాడు. క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ తర్వాత.. 200వ వన్డేలో సెంచరీ బాదిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు.

లాథమ్ సెంచరీతో భారత్ ఓటమి

కోహ్లీ సెంచరీతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. అనంతరం 281 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు 49 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో లాథమ్ (103 నాటౌట్) సెంచరీ చేయగా, రాస్ టేలర్ 95 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

200వ వన్డేలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ

200వ వన్డేలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ

ఇక, రోహిత్ శర్మ 200వ వన్డేలో కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. తన 200వ వన్డేలో రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహారించాడు. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలిపోయింది. స్వింగ్‌, బౌన్స్‌, సీమ్ అధికంగా ఉండ‌డంతో భారత బ్యాట్స్‌మెన్ కివీస్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన‌డంలో ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజ్ వ‌ద్ద నిల‌వ‌లేక‌పోయారు. బౌల్ట్ ప‌ది ఓవ‌ర్ల‌లో 21 ప‌రుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.

చెత్త ప్రదర్శన చేసిన టీమిండియా

చెత్త ప్రదర్శన చేసిన టీమిండియా

అనంతరం భారత్ నిర్దేశించిన 93 ప‌రుగుల ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ కేవ‌లం 14.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రాస్ టేల‌ర్ 37, నికోల‌స్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన బౌల్ట్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. దీంతో 200వ వన్డే రోహిత్‌కు చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. అయితే, ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్‌ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకోవడం విశేషం.

Story first published: Thursday, January 31, 2019, 17:34 [IST]
Other articles published on Jan 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+