కోహ్లీ, పంత్ ఫెయిర్‌నెస్ క్రీం యాడ్‌పై ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు (వీడియో)

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో కలిసి నటించిన హిమాలయా ఫెయిర్‌నెస్ క్రీం యాడ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ యాడ్‌లో కోహ్లీ.. పంత్‌లు పాట పాడుతుంటే అందులో అనుకోకుండా పంత్ మొటిమల గురించి ప్రస్తావన వస్తుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో విరాట్ కోహ్లీ హిమాలయా ఫెయిర్‌నెస్ క్రీం చూపించి దానిని వాడితే తగ్గిపోతుందని చెబుతాడు. అయితే, ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడగానే పంత్ మొటిమలు తగ్గిపోతాయి. ఈ వీడియోని విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో నెటిజన్లు వీరిద్దరిపై తెగ ట్రోల్ చేస్తున్నారు.
'వీరిద్దరినీ 12నెలలు నిషేదించండి ప్లీజ్' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... మరొక నెటిజన్ 'ఎవరైనా చూడడానికి ముందే ఈ వీడియోని డిలీట్ చేయి బ్రో' అని కామెంట్ పెట్టాడు. ఇంకో నెటిజన్ అయితే 'ఎవడైనా మొటిమల మీద పాట పాడతాడా.. మీరు తప్ప' అని వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications