Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కూడా ధోనిలా: కెప్టెన్సీపై గంగూలీ ఏమన్నాడో తెలుసా?

హైదరాబాద్: మూడు ఫార్మెట్లకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా నియమించడం మంచి నిర్ణయమని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. కోల్‌కతాలో గంగూలీ మాట్లాడుతూ సెలెక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డాడు. ధోని తర్వాత కెప్టెన్‌గా కోహ్లీ అన్ని విధాలా అర్హుడని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విజయపథంలో నడుస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోనీ స్థానంలో కెప్టెన్‌ గా కోహ్లీ సరైన వ్యక్తి అని గంగూలీ తెలిపాడు. ధోని మాదిరే కోహ్లీ కూడా టీమిండియాకు సమాన స్థాయిలో జట్టుకు విజయాలు అందిస్తాడని, ఇందులో ఎటువంటి సందేహం లేదని గంగూలీ అన్నాడు.

ధోని స్ధానంలో కెప్టెన్‌గా కోహ్లీ

ధోని స్ధానంలో కెప్టెన్‌గా కోహ్లీ

పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడంతో వన్డే, టీ20 సిరిస్‌లకు ధోని స్ధానంలో కెప్టెన్‌గా కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా వైదొలగినప్పటికీ ఆటగాడిగా మాత్రం ధోని కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ధోనీతో పాటు ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌‌ని కూడా జట్టులోకి తీసుకున్నారు.

యువీని మళ్లీ జట్టులోకి తీసుకోవడం శుభపరిణామం

యువీని మళ్లీ జట్టులోకి తీసుకోవడం శుభపరిణామం

యువరాజ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవడం శుభపరిణామని, అతను రాణిస్తాడనే నమ్మకముందని గంగూలీ చెప్పాడు. దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2013 డిసెంబర్‌లో చివరిసారిగా భారత జట్టు తరఫున యువరాజ్ సింగ్ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జట్టుకు దూరంగానే ఉన్నాడు.

బరోడా జట్టుపై యువరాజ్ డబుల్ సెంచరీ

బరోడా జట్టుపై యువరాజ్ డబుల్ సెంచరీ

భారత జట్టులోకి మళ్లీ వస్తానని, నీలం రంగు జెర్సీ ధరిస్తానని గతంలో యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అతడు అనుకున్నట్లే జట్టులోకి పునరాగమనం చేశాడు. 2016 17 రంజీ సీజన్‌లో యువరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. బరోడా జట్టుపై డబుల్ సెంచరీని కూడా సాధించాడు.

యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి

యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి

ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని జట్టులోకి తీసుకోవడం జరిగిందని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ జట్టును ప్రకటించే సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా ఒక డబుల్ సెంచరీతో పాటు 180 కూడా స్కోర్ చేసి చక్కని ఫామ్ కనబర్చాడని ఆయన గుర్తు చేశారు.

కోహ్లీ వల్లే యువీకి భారత జట్టులో చోటు

కోహ్లీ వల్లే యువీకి భారత జట్టులో చోటు

అందుకే యూవీకి రెండు ఫార్మెట్‌లలో అవకాశం ఇచ్చామని తెలిపారు. తామంతా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ జట్టుని ఎంపిక చేశారమని, ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నామని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం కోహ్లీ వల్లే యువీకి భారత జట్టు చోటు దక్కిందని అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+