చికెన్ బర్గర్ చూసి ఆగలేకపోయా.. ఫుల్‌గా లాగించేశా: కోహ్లీ

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. కెరీర్ ఆరంభం నుండి పరుగుల వరద పారిస్తూ.. 'రన్ మెషిన్'గా పేరొందాడు. ఇలా పరుగులు చేయడానికి ఫిట్‌నెస్ ప్రధాన కారణం అని కోహ్లీ గతంలో చాలా సార్లు చెప్పాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. ఏది తిన్నా, తాగినా ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు. శరీరానికి అవసరమైనవే తీసుకుంటాడు. అయితే అవసరమైనప్పుడు కోహ్లీ కడుపునిండా ఆరగిస్తాడట.

ముంబై వాతావరణంలో అలసిపోయా:
2016లో ముంబైలో డబుల్ సెంచరీ చేసిన తర్వాత చికెన్ బర్గర్, ఫ్రైస్, చాక్లెట్ డ్రింక్ తీసుకున్నానని కోహ్లీ తాజాగా తెలిపాడు. 'ముంబైలో ఉక్కపోత వాతావరణంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 235 పరుగులు చేశా. చాలా అలసిపోయా. ఎందుకంటే.. మ్యాచ్ ఆడేటప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోను. అరటి పండ్లు, కొద్దిగా అన్నం, పప్పు తీసుకుంటా' అని కోహ్లీ తెలిపాడు.

బర్గర్ చూసి ఆగలేకపోయా:
'అయితే అప్పటి ఫిట్‌నెస్ ట్రైనర్ శంకర్ బసూ నాకు బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ రాత్రి ఏమైనా తినొచ్చు అని చెప్పాడు. అప్పుడు నేను మాంసాహారం తీసుకుంటున్నా. వెంటనే చికెన్ బర్గర్ ఆర్డర్ చేశా. పైన బన్ తీయగానే.. ఆగలేకపోయా. ఒక్క బ్రెడ్ ముక్కేగా అనుకున్నా. ఆపకుండా తినేశా. ఆ తర్వాత ప్లేటు నిండా ఫ్రైస్ తిన్నా. ఆపై చాకోలెట్ షేక్ తీసుకున్నా. ఎందకంటే నా శరీరానికి అవన్నీ అవసరమని తెలుసు. నా దేహానికి పిండిపదార్థాలు అవసరమైతే అవికూడా లాగించేస్తా' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఫిట్‌నెస్‌లో టీమిండియానే టాప్:
కోహ్లీ గత కొన్నేళ్ల నుంచి ఆహారం విషయంలో కఠినమైన నిబద్ధతతో ఉంటున్నాడు. దాంతో పాటు ఫిట్‌నెస్‌కు సంబంధించిన వర్కౌట్లు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత కోహ్లీ జట్టులో ఫిట్‌నెస్ స్టాండర్డ్స్‌ను ఏ విధంగా పెంచాడో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఫిట్‌నెస్ కలిగిన ఆటగాళ్లను కలిగిన ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications