న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జహీర్‌తో కలిసి భార్య అనుష్క నటించిన సినిమాను చూసిన కోహ్లీ

Virat Kohli reviews Anushka Sharma’s Sui Dhaaga: So proud my love, he says

హైదరాబాద్: తన భార్య అనుష్క శర్మపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అనుష్క శర్మ, వరుణ్ ధావన్ కలిసి నటించిన సూయి దాగా సినిమాను గురువారం వీక్షించిన కోహ్లీ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. సూయి దాగా సినిమాను రెండు సార్లు చూసినట్లు కోహ్లీ తెలిపాడు.

చూడండి: భారత బుల్లి ఫ్యాన్‌ని బుజ్జగించిన రషీద్ ఖాన్, భువీచూడండి: భారత బుల్లి ఫ్యాన్‌ని బుజ్జగించిన రషీద్ ఖాన్, భువీ

"సూయి దాగా చిత్రాన్ని రెండు సార్లు చూశానని, మొదటి సారి కన్నా రెండవ సారి ఇంకా బాగా నచ్చింది. ఈ చిత్రం భావోద్వేగంతో కూడుకున్న రోలర్‌కోస్టర్‌ లాంటిది. సినిమాలోని ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు. మౌజీ(వరుణ్‌ ధావన్‌) సూపర్‌గా నటించాడు. సినిమాలో ఆమెది చాలా నిదానమైన పాత్ర అయినప్పటికీ.. శక్తిమంతమైన, ప్రభావవంతమైన పాత్ర. మమత పాత్రలో నటించిన అనుష్క అభినయనం తన మనసును దోచుకుంది. మమత మీ మనసులు కూడా దోచుకుంటుంది. సో ప్రౌడ్ మై లవ్" అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.

స్క్రీనింగ్‌కు హాజరైన జహీర్ ఖాన్, సాగరిక

స్క్రీనింగ్‌కు హాజరైన జహీర్ ఖాన్, సాగరిక

ఈ సినిమా స్క్రీనింగ్‌కు విరాట్ కోహ్లీ దంపతులతో పాటు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తన భార్య సాగరికతో కలిసి హాజరయ్యాడు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌ ఈ సినిమాలో అనుష్క భర్తగా నటించాడు. రబ్ నే బానది జోడి తరహాలో అనుష్క భార్యగా మరో సహజసిద్ధమైన పాత్రలో నటించింది. ఈ సినిమాపై అద్భుత ప్రశంసలు వస్తున్నాయి. అంతేకాదు బాక్సాఫీసు వద్ద ఈ సినిమా దూసుకుపోతోంది.

సూయి ధాగా.. మేడ్ ఇన్ ఇండియా అనేది క్యాప్షన్

సూయి ధాగా.. మేడ్ ఇన్ ఇండియా అనేది క్యాప్షన్

సూయి ధాగా.. మేడ్ ఇన్ ఇండియా అనేది క్యాప్షన్. వరుణ్ ధావన్, అనుష్క శర్మ ఈ చిత్రంలో పేద దంపతులుగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్ ట్రైలర్ నుంచి వస్త్రాల కంపెనీ ప్రారంభించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేదే ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో అనుష్క సహజత్వానికి దగ్గరగా కొన్ని హావభావాలు పలికించింది. సినిమా ట్రైలర్‌లోని కొన్ని స్టిల్స్ ఇప్పటికే వైరల్‌గా మారాయి.

సూయి ధాగా ఛాలెంజ్‌ను స్వీకరించిన షారుఖ్ ఖాన్

సూయి ధాగా ఛాలెంజ్‌ను స్వీకరించిన షారుఖ్ ఖాన్

ఈ సినిమాకి దర్శకుడు శరత్‌ కటారియా. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదలకు ముందు ఈ సినిమాను వినూత్నంగా ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ‘సూయి ధాగా ఛాలెంజ్‌'ను చిత్ర బృందం పలువురు ప్రముఖులకు సవాల్‌ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ ‘ఖిలాడీ' అక్షయ్‌కుమార్‌తో పాటు, ‘బాద్‌షా' షారుక్‌ఖాన్‌లకు వరుణ్‌, అనుష్కలు ‘సూయి ధాగా' ఛాలెంజ్‌ విసిరారు. సూదిలో దారం ఎక్కించడంలో అక్షయ్‌ విఫలం కాగా, షారుక్‌‌ కొద్ది సమయంలోనే సూదిలో దారం ఎక్కించి సవాల్‌ను గెలిచారు. ఈ వీడియోను షారుక్‌‌ తన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. పెద్ద రంధ్రం ఉన్న సూదికి షారుక్‌ దారం ఎక్కించడం నవ్వులు పూయిస్తోంది. అనుష్కశర్మ ఛాలెంజ్‌ను పూర్తి చేశాను. లవ్‌ యూ ‘సూయిధాగా'కు ఆల్‌ ది బెస్ట్‌. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. కచ్చితంగా చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అని ట్వీట్‌ చేశారు.

 'సూయి ధాగా' సినిమాపై మంత్రి ప్రశంసలు

'సూయి ధాగా' సినిమాపై మంత్రి ప్రశంసలు

'సూయి ధాగా' సినిమా చూసిన మంత్రి స్మత్రి ఇరానీ ప్రశంసిస్తూ భారతీయ దుస్తులను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. "ఎక్కడి దుస్తులకు అక్కడి పేరు. కేవలం మన దుస్తులను చేతులతో నేస్తూ వారి కలలను సాకారం చేసుకునేవారు మన దేశంలో ఎంత మంది ఉన్నారు? 'సూయి ధాగా' చిత్రం మన భారతీయ దుస్తులకు మేక్‌ ఇన్‌ ఇండియా పేరుతో ప్రచారం కల్పిస్తుంది. చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక యష్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన అనుష్క ఈ చిత్రంలో గ్రావిూణ యువతిగా నూలు చీరల్లో కనిపించడం కొత్తగా ఉంది. వరుణ్‌ ధావన్‌ కూడా తొలి సారి విూసాలతో విభిన్నమైన గెటప్‌లో కనిపించాడు.

Story first published: Friday, September 28, 2018, 12:45 [IST]
Other articles published on Sep 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X