
హైదరాబాద్: కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ జట్టులో ఫిట్‌నెస్ స్టాండర్డ్స్‌ను ఏ విధంగా పెంచాడో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఫిట్‌నెస్ కలిగిన ఆటగాళ్లను కలిగిన ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. అలాంటి కోహ్లీ అథ్లెటిక్స్ స్కిల్స్‌లో జడేజా ప్రతిభ అమోఘం అంటూ కొనియాడాడు.
టీమిండియా నెట్ సెషన్స్‌లో భాగంగా జడేజా-పంత్‌లతో కలిసి పరుగు పెట్టిన ఒక ఫోటోను కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. "గ్రూప్ కండీషనింగ్ సెషన్స్‌ను ఎక్కువగా ప్రేమిస్తా. కాకపోతే జడేజా గ్రూప్‌లో ఉంటే అతడిని దాటుకు వెళ్లడం దాదాపు అసాధ్యం" అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.
ఇక, రవీంద్ర జడేజా విషయానికి వస్తే అత్యుత్తమ ఫీల్డర్ అన్న సంగతి తెలిసిందే. మెరుపు ఫీల్డింగ్‌తో అద్భుతమైన క్యాచ్‌లను అందుకోవడంలో దిట్ట. ముఖ్యంగా మిడ్ ఫీల్డింగ్‌లో జడేజా ఉన్నాడంటే ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్ సైతం ఆచితూచి ఆడుతుంటారు. అల్ రౌండర్‌గా టీమిండియాలో జడేజాది ప్రత్యేకమైన స్థానం.
కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టీమిండియాకు ఇది వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.
ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు చెలరేగడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది. ఈ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ 360 పాయింట్లకు చేరింది.