Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

463కి సచిన్ 49.. 205కి కోహ్లీ 34: త్వరలోనే టెండూల్కర్‌ను దాటేస్తాడా?

India vs South Africa : Virat Kohli & co aim for Whitewash
Virat Kohli reveals what he wants to do when he is 35

హైదరాబాద్: బుదవారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ కోహ్లీ వన్డేల్లో 34వ సెంచరీగా చరిత్రకెక్కింది. దీంతో కెప్టెన్ గా గంగూలీ రికార్డును సైతం కోహ్లీ బద్దలుకొట్టాడు. ఈ కేప్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 12 ఫోర్లు, రెండు సిక్సులు చేసి సెంచరీ నమోదు చేశాడు.

గత ఐదేళ్లుగా వరుసగా రికార్డులు సృష్టిస్తున్న కోహ్లీ ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఓ సంచలనంగా మారాడు. విరాట్ కోహ్లీ వన్డే సెంచరీల్లో సచిన్ ను అధిగమిస్తాడా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

సచిన్ టెండూల్కర్ వన్డే కెరీర్లో 463 మ్యాచ్ లకు గాను 49 సెంచరీలు చేస్తే కోహ్లీ 205 మ్యాచ్ లకు 34 సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత సంవత్సరానికి ఇప్పటికే కోహ్లీ రెండు సెంచరీలను చేసేశాడు. దీనిని బట్టి చూస్తే వన్డే కెరీర్ విషయంలో కోహ్లీ సచిన్ టెండూల్కర్ ను త్వరలోనే అందుకోగలడనే చెప్పాలి.

మూడో వన్డే అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. తన 35 ఏళ్ల వయస్సులో ఎలా ఉండాలనుకుంటున్నాడో వివరించాడు. 'ఈ ఏడాదితో నాకు 30 సంవత్సరాలు రాబోతున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ ఫిట్ నెస్ తగ్గిపోతుంది. అందుకని నేను ఇంకో ఐదేళ్లు అయినా కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. దానికి తగ్గట్టే ఆహార నియమాలను పాటిస్తున్నా. అత్యంత కుతూహలంతో క్రికెట్ ఆడేవాళ్లలో నేనూ ఒకడ్ని. దానిని అలానే కాపాడుకుంటా' అని వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 12:51 [IST]
Other articles published on Feb 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+